SAKSHATKARA VAIBHAVAM CONCLUDES _ ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు

TIRUPATI, 05 JULY 2022: The annual three-day Sakshatkara Vaibhavams concluded on a grand religious note with Garuda Vahana Seva on Tuesday evening at Srinivasa Mangapuram.

 

TTD JEO Sri Veerabrahmam, Spl Gr DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurthy, Archaka Sri Balaji Rangacharyulu, Superintendents Sri Chengalrayalu, Sri Ramanaiah, large number of devotees and others were present.

 

On July 6 Paruveta Utsavam will be observed at the Paruveta Mandapam located near Srivari Mettu between 11am and 3pm.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న అభయం

ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు

తిరుపతి, 2022 జులై 05: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు  మంగళవారం ముగిశాయి. చివరి రోజు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని  మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆల‌య ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ జరిగింది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈఓ శ్రీ గురుమూర్తి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

జులై 6న పార్వేట ఉత్సవం :

శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 6న బుధవారం పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం చేప‌డ‌తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.