SAKSHATKARA VAIBHAVAMS POSTERS RELEASED_ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాక్షాత్కార వైభవం పోస్టర్లు ఆవిష్కరించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 6 July 2018: The annual ‘Sakshatkara Vaibhavam’ at Kalyana Venkateswara temple in Srinivasa Mangapuram, near Tirupathi will be celebrated between July 16th and 18 and Tirupati JEO Sri P Bhaskar released posters in connection with this fete on Friday.

The koil alwar tirumanjanam to the fete will be celebrated on July 12.

Priests of Sri Kalyana Venkateswara Swamy perform Snapana Thirumanjanam (Celestial Bath) to the processional deities from 9 am to 10.30 am inside temple premises during these days. This festival is considered to be as important on par with the Annual Brahmotsavams.

On first day evening, the lord will take ride on Golden Tiruchi, second day on Hanumantha and final day on Garuda Vahanam. Meanwhile the Paruveta Utsavam will be observed on July 19 near Srivari Mettu.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాక్షాత్కార వైభవం పోస్టర్లు ఆవిష్కరించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 జులై 06: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ జులై 16 నుండి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం జులై 12వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందన్నారు. కార్యక్రమంలో భాగంగా జులై 16,17, 18వ తేదీలలో ఉదయం 9.00 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు.

జూలై 16వ తేదీ సోమవారం రాత్రి 7.00 గంటల నుండి 8.00 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

జూలై 17వ తేదీ మంగళవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.

జూలై 18వ తేదీ బుధవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

జులై 19న పార్వేట ఉత్సవం :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జులై 19వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.