SAMPOORNA SUNDARAKANDA AKHANDA PARAYANAM CONCLUDES _ ముగిసిన సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం
TIRUMALA, 29 MAY 2022: With the spiritual fervour touching the sky, the Sampoorna Sundarakanda Akhanda Parayanam concluded on Sunday night amidst the rhythmic chanting of shlokas.
The Akhanda Parayana Yagnam continued for nearly 16hours without break. The Vedic pundits were divided into four groups and all the 2800 odd shlokas were recited on rotation basis.
The Prayer Hall in Dharmagiri was decked up to match the occasion with the deities if Srivaru with Sridevi and Bhudevi on one side, Sri Sita Lakshmana Anjaneya sameta Rama on another side and Rukmini sameta Sri Krishna on another side. The dioromas of Anjaneya at different places stood as special attraction.
The entire premises of Dharmagiri reverberated to the rhythmic rendition of Akhanda Sundarakanda Parayanam by Vedic Scholars and devotees.
At the beginning and at the end of this spiritual event Annamacharya Project artistes rendered Hanuman Sankeertan and Bhajan. Later the program concluded with Mangala Harati.
TTD EO Sri AV Dharma Reddy and other officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముగిసిన సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం
తిరుమల, 2022 మే 29: తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఆదివారం ఉదయం ప్రారంభమైన సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం రాత్రి ముగిసింది. వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య దాదాపు 16 గంటల పాటు నిర్విరామంగా అఖండ పారాయణ యజ్ఞం కొనసాగింది. నాలుగు బృందాల్లో వేద పండితులు మొత్తం 2,808 శ్లోకాలను ఒక బృందం తరువాత మరొక బృందంగా పఠించారు.
ఒకవైపు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు, మరో వైపు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత రాముడు, మరో వైపు రుక్మిణీ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులు ఉండగా ధర్మగిరిలోని ప్రార్థనా మందిరాన్ని వివిధ దేవతామూర్తులతో అలంకరించారు. వివిధ చోట్ల ఆంజనేయుడి దివ్యరూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వేదపండితులు, భక్తులు చేసిన అఖండ సుందరకాండ పారాయణంతో ధర్మగిరి ప్రాంగణం మారుమోగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభంలో, ముగింపులో అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు హనుమాన్ సంకీర్తనలు ఆలపించడంతో పాటు భజన చేశారు. అనంతరం మంగళహారతితో కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.