GREAT GESTURE BY TTD FOR THE WELL BEING OF HUMANITY – MATHURA SWAMIJI ON AKHANDA PARAYANAM _ మానవాళి శ్రేయస్సు కోసం పారాయణ యజ్ఞం చేయడం గొప్ప విషయం -మధుర స్వామీజీ

DEVOTEES COMPLIMENTS TTD FOR SUNDARAKANDA AKHANDA PARAYANA

 

TIRUMALA, 29 MAY 2022: The Akhanda Sampoorna Sundarakanda Pathanam held by TTD at Dharmagiri Veda Vignana Peetham in Tirumala on Sunday with a noble aim to protect the entire humanity from the ill effects of Corona and bless the people with peace and prosperity has received an overwhelming response from devotees across the country as well overseas.

 

A few devotees who participated in this Parayana Yagna shared their opinions on the Parayanam. In their words…

 

“Performing Sampoorna Sundarakanda Akhanda Parayanam itself is a great task. That too with a noble intention of seeking the divine blessings for the well-being of the entire humanity, TTD has done this Parayana as a Yagana which is commendable, said Guru Sri Raja Ram Pandey, a devotee from Mathura of Uttar Pradesh.

 

He also complimented the TTD for its recent initiatives in safeguarding Desi Cows like Go puja, Navaneeta Seva, Govinduniki Go Adharita Naivedyam, Veda Parayanam inside the temple, construction of temples in backward areas etc. “I have been coming to Tirumala for the past three decades. But the recent dharmic activities by TTD taken up as a part of protection of Hindu Sanatana Dharma are really appreciable”, he expressed.

 

Another devotee, Smt Prabha from Palakollu said, “We are a team of housewives who regularly recite Sundarakanda chapters everyday. After seeing the promo on SVBC about the Akhanda Parayanam, I came all the way from my native place along with my neighbours to Tirumala only to take part in this Parayana Yagnam. It was really a divine experience and our sincere thanks to TTD management for organising such a unique spiritual event”, she said with ecstasy. 

 

Smt Vasanta from Chennai said, I have been attending almost every Akhanda Parayanam organised by TTD at Nada Neerajanam platform. And today, it was totally a unique experience to participate in the Sampoorna Akhanda Sundarakanda Parayanam in the green precincts of Dharmagiri Veda Peetham”, she maintained.

 

Following the SVBC Promos in Telugu, Tamil, Kannada and Hindi channels on the Parayanam, devotees from various parts of the country participated in the Parayanam by sitting in their houses. The SVBC also received scores of appreciation messages from Srivari devotees hailing from US, Australia and other countries also. 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మానవాళి శ్రేయస్సు కోసం పారాయణ యజ్ఞం చేయడం గొప్ప విషయం -మధుర స్వామీజీ

– సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించినందుకు టిటిడికి భక్తుల అభినందనలు

తిరుమ‌ల‌, 2022 మే 29: కరోనా మహమ్మారి బారి నుంచి మానవాళిని రక్షించి, ప్రజలకు శాంతి, సౌభాగ్యాలను ప్రసాదించాలనే సంకల్పంతో ఆదివారం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ సంపూర్ణ సుందరకాండ పఠనానికి విశేష స్పందన లభించింది. దేశం నలుమూలలతోపాటు విదేశాల నుండి సైతం భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్లోక పారాయణంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొంతమంది భక్తులు పారాయణంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారి మాటల్లోనే… సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించడం చాలా గొప్ప కార్యమని, సర్వ మానవాళి సుఖశాంతులతో ఉండాలని భగవంతుని అనుగ్రహాన్ని పొందాలనే సంకల్పంతో టీటీడీ ఈ పారాయణాన్ని నిర్వహించడం అభినందనీయమని ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన భక్తుడు శ్రీ గురు రాజారాం పాండే అన్నారు. గోపూజ, నవనీత సేవ, గోవిందునికి గో అధారిత నైవేద్యం, ఆలయంలో వేదపారాయణం, వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, దేశీయ గోవులను సంరక్షించడంలో టీటీడీ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలకు ఆయన అభినందనలు తెలిపారు. “నేను గత మూడు దశాబ్దాలుగా తిరుమలకు వస్తున్నాను. అయితే హిందూ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా టీటీడీ ఇటీవల చేపట్టిన ధార్మిక కార్యక్రమాలు నిజంగా అభినందనీయం’’ అని ఆయన అన్నారు.

పాలకొల్లుకు చెందిన మరో భక్తురాలు శ్రీమతి ప్రభ మాట్లాడుతూ.. నిత్యం సుందరకాండ అధ్యాయాలు పారాయణం చేస్తుంటాం. అఖండ పారాయణం గురించి ఎస్‌వీబీసీలో వచ్చిన ప్రోమో చూసి ఇరుగుపొరుగు వారితో కలిసి స్వగ్రామం నుంచి తిరుమలకు యాత్రకు వచ్చాను. ఈ పారాయణ యజ్ఞంలో పాలుపంచుకోవడం ఒక దివ్యమైన అనుభూతి అని, ఇంత అపూర్వమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీటీడీ యాజమాన్యానికి మా హృదయపూర్వక ధన్యవాదములు’’ అని ఆమె ఆనందంతో అన్నారు.

చెన్నైకి చెందిన శ్రీమతి వసంత మాట్లాడుతూ, నాద నీరాజనం వేదికపై టీటీడీ నిర్వహించే దాదాపు ప్రతి అఖండ పారాయణానికి హాజరవుతున్నాను. ఈరోజు ధర్మగిరి వేదపీఠంలోని పచ్చని ఆవరణలో సంపూర్ణ అఖండ సుందరకాండ పారాయణంలో పాల్గొనడం పూర్తిగా అపూర్వమైన అనుభూతిని కలిగిస్తోంది’’ అని ఆమె పేర్కొన్నారు.

దేశం నలుమూలలతో పాటు, విదేశాల నుండి కూడా శ్రీవారి భక్తులు పారాయణాన్ని వీక్షించారు. అమెరికా, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లోని భక్తుల నుండి ఎస్వీబీసీకి ప్రశంసా సందేశాలు వచ్చాయి.

ఆకాశ‌గంగ‌, జాపాలిలో ముగిసిన ధార్మిక‌, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు

హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా నాదనీరాజనం, ఆకాశ‌గంగ, జ‌పాలి తీర్థంలో నిర్వహిస్తున్న ధార్మిక, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు ఆదివారం ముగిశాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.