SAPTHA VAHANA SEVA FOR PADMAVATHI DEVI ON RADHASAPTHAMI _ సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

TIRUPATI, 28 JANUARY 2023: The one-day Brahmotsavam, Radhasapthami in Tiruchanoor Sri Padmavathi Ammavaru temple was observed with utmost devotion on Saturday as the Goddess of Riches took out a celestial ride on Seven carriers to bless Her devotees.

In connection with Surya Jayanti, Radhasapthami was observed in Tiruchanoor in a grand manner akin to Tirumala.

The Vahana Sevas in Tiruchanoor commenced with Suryaprabha Vahanam at 7 am followed by Hamsa, Aswa, Garuda, and Chinna Sesha till the first half.

The second half of carriers commenced from 3:30 pm onwards with Snapana Tirumanjanam. The evening vahana sevas include Chandraprabha and conclude with Gaja Vahanam, the favorite carrier of Sri Padmavathi Devi.

On the other hand in the sub-shrine of Sri Surya Narayana Swamy, the processional deity blessed devotees on Aswa Vahanam at 6 am.

The devotional cultural performances presented by the various artists from Hindu Dharma Prachara Parishad allured the devotees. 

Deputy EO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, Archaka Sri Babu Swamy, and other temple staff were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

 తిరుపతి, 2023 జనవరి 28 ;సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో రథసప్తమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై అమ్మవారు దర్శనమివ్వడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించాయి. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మ‌వారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.

ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, ఆధ్వర్యంలో భజన బృందాలు పాల్గొన్నాయి. కోలాటాలు, చెక్కభజనలు, చిడతల భజన తదితర ప్రదర్శనలిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.