SAREES PRESENTED TO WOMEN BARBERS _ మహిళ క్షురకులకు చీరలు అందించిన అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
Tirumala, 2 Oct. 19: The Additional EO Sri AV Dharma Reddy has presented two sets of sarees to the women barbers of Kalyanakatta in Tirumala.
Among the total of 1350 barbers, 220 are women barbers in Tirumala.
Upon the request of women barbers during their orientation programme last week at Asthana Mandapam in Tirumala, the Addnl. EO assured them to provide sarees on donation basis before brahmotsavams.
The JEO instructed the officials to prepare an indent of male barbers also to present them uniform.
Speaking on the occasion, DyEO Smt Nagarathna said, as assured, the Addnl. EO presented the uniform sarees to all the women barbers and kept up his word. It is now the turn of all the barbers to render more services with dedication to pilgrims.
AEO Sri Jagannadhachari and other office staffs were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల, 2019 అక్టోబరు 02: తిరుమలలోని కల్యాణకట్ట మహిళా క్షురకులకు రెండు సెట్ల చీరలను అదనపు ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి బుధవారం అందజేశారు.
తిరుమల కల్యాణ కట్టలో మొత్తం 1350 క్షురకులలో 220 మహిళా క్షురకులు విధులు నిర్వహిస్తున్నారు. గత వారం తిరుమలలోని అస్థాన మండపంలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమంలో మహిళా క్షురకుల అభ్యర్థన మేరకు బ్రహ్మోత్సవాలకు ముందు విరాళంగా చీరలు ఇస్తామని అదనపు ఈవో వారికి హామీ ఇచ్చారు.
మగ క్షురకులకు అవసరమైన యూనిఫామ్ ఇండెంట్‌ను సమర్పించాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న మాట్లాడుతూ అదనపు ఈవో హామీ ఇచ్చినట్లుగా, అన్ని మహిళా క్షురకులకు యూనిఫాం చీరలను అందజేసినట్లు తెలిపారు. యాత్రికులకు అంకితభావంతో మరింత ఉన్నతంగా సేవలను అందించాలని క్షురకులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ జగన్నాధాచారి మరియు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.