SRIVARI PADI SARE TO AMMAVARU_ నవంబరు 23న శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె

Tirumala, 21 November 2017: The traditional “Padi Sare” which is a gift to Goddess Padmavathi from Lord Venkateswara from Tirumala will reach Tiruchanoor on the day of Panchami Theertham on November 23.

The procession of Sare will take place in Tirumala between 4:30am to 5:30am and later a team of officers accompanied by priests take the sare and reach Alipiri, Komalamma Satram before reaching Tiruchanoor.

Later the sare consisting of Turmeric, vermilion, pattu sari, Prasadams etc. which is carried on a temple elephant is collected at Pasupu Mandapam and from there carried to Panchami Theertha Mandapam.

The Snapana Tirumanjanam starts after 10am and the Panchami Theertha Chakra Snanam will be observed by 11:45am in the advent of Uttarashada star in Makara Lagnam.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

నవంబరు 23న శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె

తిరుమల, 2017 నవంబరు 21: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మూత్సవాల్లో చివరిరోజైన నవంబరు 23వ తేదీ గురువారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి సమర్పించనున్నారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా గురువారం ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలవుతుంది. గజాలపై ఈ సారెను ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగింపుగా కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకొస్తారు. అక్కడినుంచి కోమలమ్మ సత్రం(ఆర్‌ఎస్‌గార్డెన్‌) చేరుకుంటారు. అనంతరం తిరుపతి పురవీధుల గుండా తిరుచానూరు పసుపు మండపానికి సారె చేరుతుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు, అధికార గణంతో కలిసి ఊరేగింపుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుష్కరిణి వద్దకు సారె చేరుకుంటుంది. ఆ తరువాత ఉదయం 10 గంటలకు పుష్కరిణిలోని పంచమితీర్థం మండపంలో స్నపనతిరుమంజనం మొదలవుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.