SARVA DARSHAN COMMENCES AT 6AM _ ఉదయం 6 గంటల నుండే వైకుంఠ ద్వార సర్వదర్శనం ప్రారంభం – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

TIRUMALA, 02 JANUARY 2023: The Vaikuntha Dwara Darshan for common pilgrims commenced at 6am on Monday as per schedule said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

 

After the commencement of Sarva darshan the Chairman the Vaikuntha Dwara Darshanam commenced after Dhanurmasa Kainkaryams at 1.45am and the darshan for common devotees from 6am onwards.

 

The devotees are following the prescribed rules by TTD and we are appealing to them to come for Vaikuntha Dwara Darshanam on the given date and time slot of the token issued to them.

 

When he interacted with the devotees in the temple, they also expressed immense satisfaction over the arrangements by TTD.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఉదయం 6 గంటల నుండే వైకుంఠ ద్వార సర్వదర్శనం ప్రారంభం – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 2 జనవరి 2023: సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండే సర్వదర్శనం ప్రారంభించామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

సర్వదర్శనం ప్రారంభమైన అనంతరం శ్రీవారి ఆలయం ముందు, ఆ తరువాత అన్నమయ్య భవన్లో శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10 రోజులు సిఫారసు లేఖలపై జారీ చేసే దర్శనాలు రద్దు చేశామన్నారు. అలాగే శ్రీవాణి టికెట్లు కూడా ఆఫ్ లైన్లో రద్దు చేసినట్లు ఆయన వివరించారు. సామాన్య భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించామన్నారు. భక్తులు టోకెన్ తీసుకునే వారికి నిర్దేశించిన సమయానికి తిరుమల క్యూ లైన్ లోకి రావాలని టీటీడీ చేసిన విజ్ఞప్తికి భక్తులు పూర్తిగా సహకరించారని చైర్మన్ వివరించారు. సర్వదర్శనం ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని అన్నారు.

అధికారులు,సిబ్బంది పక్కా ప్రణాళికతో చక్కగా పని చేస్తున్నారని ఆయన అభినందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది