SARVA SWATANTRA VEERA LAKSHMI TAKES PRIDE RIDE ON MAMMOTH WOODEN CHARIOT_ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

Tiruchanur, 22 November 2017: On the penultimate day on Wednesday, Goddess Sri Padmavathi Devi took a pride ride on the massive wooden chariot along the four mada streets encircling the Tiruchanoor temple.

As a part of the ongoing annual Karthika Brahmotsavams in Tiruchanoor, on the eighth day morning, Goddess as “Sarva Swatrantra Veera Lakshmi” draped in specially designed clothes made of precious pearls gracefully glided in the mada streets blessings the devotees who thronged to witness the Rathotsavam.

The chariot was tastefully decorated with different varieties of flowers, flags and festoons. The chariot rolled majestically down the thoroughfares of the temple preceded by temple paraphernalia, including a couple of elephants, horses, bulls, cultural and bhajan troops besides a contingent of Vedic pundits led by the priests of the temple.

According to Kathopanishad, Radham is compared to the blending of the soul with the body, while the horses which pull the chariot are compared to the human senses. All these are controlled by the Universal Mother showing us the right path to lead a righteous life.

The temple management also allowed the pilgrims, along with its staff, to pull the chariot. As the congregation was huge, the temple management facilitated the chariot movement at a slow pace for the convenience of the devotees. While the engineering staff maneuvered the movement of the chariot, the district police, along with the Tirumala Tirupati Devasthanams vigilance and security personnel, managed the crowd with the help of scouts and guides, Srivari Seva volunteers.

TTD EO Anil Kumar Singhal, JEO Tirupati Sri P Bhaskar, Chandragiri MLA Sri Chavireddy Bhaskar Reddy, Spl Gr DyEO Sri Muniratnam Reddy, CVSO Sri Ake Ravikrishna, ACVSO Sri Sivakumar Reddy and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

తిరుపతి, 2017 నవంబరు 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయం 7.00 గంటలకు వృశ్చిక లగ్నంలో ప్రారంభమైన రథం 9.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. పిల్లల నుండి పెద్దల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి.

శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.

వాహనసేవ అనంతరం మధ్యాహ్నం 1.00 నుండి 2.30 గంటల వరకు రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, చంద్రగిరి ఎమ్‌ఎల్‌ఏ శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ రాధాకృష్ణ, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అశ్వవాహనంపై లోకరక్షణి

అలాగే రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో అమ్మవారు విహరించనున్నారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాఙ్మయం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయవేళ సాక్షిగా అశ్వం నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవాభాగ్యాన్ని పొందుతున్న భక్తులకు కలిదోషాలను తొలగిస్తుంది.

బంగారు చీరలో అమ్మవారి దర్శనం

పంచమితీర్థం పర్వదినాన అమ్మవారి మూలమూర్తికి అలంకరించే బంగారు చీరను ముందుగానే బుధవారం ఉదయం అలంకరించారు. బంగారు చీరలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అమితానందాన్ని పొందారు. కాగా బుధవారం, గురువారం బంగారు చీరలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.