TTD PUBLICATIONS ATTRACTS DENIZENS IN PAT BRAHMOTSAVAMS_ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ‘తితిదే పుస్తక విక్రయశాల’కు విశేష ఆదరణ

Tiruchanur, 22 November 2017: The TTD publications has been receiving overwhelming response from devotees during the ongoing annual brahmotsavams at Tiruchanoor.

Under the instructions of TTD EO Sri Anil Kumar Singhal, TTD PRO Dr T Ravi, who is also the chief of Sales wing of TTD, has arranged the publication stall in Friday Gardens at Tiruchanoor. Various devotional publications are made available in the stall including Bhagavatam, Valmiki Ramayanam, Annamaiah Padakosam, Tirumala Brahmotsava Prabhavam, children’s books on Ramayana and Mahabharata with pictures, Geeta Govinda Kavyam etc. have a great following among denizens.

On the other hand, sanskrit volumes including Krishna Yajurvedam, Adharvana Bhashyam, Srimad Bhagavatam and other 300 various language books are available in the stall.

TTD has also put for sales various Annamacharya, Vengamamba CDs. Apart from this devotional songs in Sanskrit, Kannada and Hindi are also available.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం -11

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ‘తితిదే పుస్తక విక్రయశాల’కు విశేష ఆదరణ

తిరుపతి, 2017 నవంబరు 22: సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మత్సవాలలో భాగంగా శుక్రవారపుతోటలో టిటిడి ఏర్పాటు చేసిన ‘పుస్తక ప్రదర్శన మరియు విక్రయశాలకు’ భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. శ్రీవారి వైభవాన్ని తెలిపే పుస్తకాలతో పాటు అనేక ధార్మిక విషయాలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు సంబందించిన పుస్తకాలు, పిల్లల నుండి పెద్దల వరకు అకట్టుకుంటున్నాయ.

టిటిడి పుస్తక విక్రయశాలలో అపురూపమైన పోతన భాగవతం (మొత్తం 12 పర్వాలు, 5 పుస్తకాలు) రాయితీపై రూ.1260/-,వాల్మీకి రామాయణం 5 పుస్తకాలు రాయితీపై రూ.1450/-అన్నమయ్య పదకోశం రూ.140/-, తిరుమల బ్రహ్మోత్సవ ప్రాభవం రూ.250/-, పండుగలు- పరమార్థములు రూ.85/-, తిరుమల ఆలయాలకు సంబంధించిన శాసనాలు (ఇంగ్లీషు) రాయితీపై రూ.495/-, శ్రీవారి హుండీలో బంగారునాణేలు(తెలుగు, ఇంగ్లీషు) రూ.2000/- తదితర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు (ఇంగ్లీషు, హింది) బొమ్మలతో కూడిన శ్రీనివాస చరితం, గీత గోవింద కావ్యం, రామాయణం ఉన్నాయ.

అంతేగాక సంస్కృత భాగవతము, కృష్ణ యజుర్వేదం, అధర్వణవేద భాష్యం, యజుర్వేద భాష్యం, నీతికథలు, పురాణాలు, రామాయణం, శ్రీమద్భాగవతం, సుందరకాండ, ఆనందనిలయం, హరికొలువు, సిరికొలువు, ఏడుకొండలు తదితర 300 రకాల తెలుగు, ఇతర భాషల ఆధ్యాత్మిక గ్రంథాలు పాఠకులను ఆకట్టుకుంటున్నాయి.

టిటిడి శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూపొందించిన అన్నమయ్య కీర్తనలు, ఇతర వాగ్గేయకారుల సంకీర్తనలు 80 రకాల సి.డి.లు భక్తులకు అందుబాటులో వున్నాయ. ‘శ్రీవేంకటేశ్వర వైభవం’, ‘కొండపైన పుణ్యతీర్థాలు’ దృశ్యకావ్యాలు రూ.50/-, ‘అన్నమయ్య గోవిందగానం’, ‘అన్నమయ్య నాదనివేదన’, ‘రెండు సిడిలలో మొత్తం 1200 అన్నమయ్య కీర్తనలు’, ‘శ్రీపద్మావతి అమ్మవారి శ్రీనామాలు’, ‘మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శివప్రణయం’, ‘బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ధార్మిక ఉపన్యాసాలు’, ‘భగవద్గీత 18 అధ్యాయాల ఉపన్యాసాలు’, శోభారాజ్‌ ఆలపించిన ‘అన్నమయ్య సంకీర్తన శోభ’ తదితర సిడిలు రూ.40/- చొప్పున ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ సిడిలు తెలుగు, సంస్కృతం, హిందీ, కన్నడ భాషల్లో భక్తులకు అందుబాటులో ఉన్నాయి.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆదేశాల మేరకు ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి పర్యవేక్షణలో టిటిడి ప్రచురణల విక్రయశాల నిర్వహిస్తున్నది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.