SARVABHOOPALA VAHANAM HELD _ సర్వభూపాల వాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కటాక్షం

TIRUPATI, 01 JUNE 2024: Rumini Satyabhama sameta Sri Venugopala Swamy blessed His devotees on the richly decked Sarvabhoopala Vahanam at Karvetinagaram on Saturday evening.

The annual Brahmotsavams have reached the fourth day in this ancient temple.

Earlier the Tiru Kalyana Mahotsavam of the deities were observed with utmost religious fervour.

AEO Sri Parthasaradhi, Superintendent Sri Soma Sekhar, temple Archakas, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సర్వభూపాల వాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కటాక్షం

తిరుపతి, 2024 జూన్ 01: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజు శనివారం రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి భక్తులను కటాక్షించారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

అంతకుముందు సాయంత్రం 5.30 నుండి 7.30 గంటల వరకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి కళ్యాణాన్ని అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.