SARVADARSHAN TOKENS FROM APRIL 12 _ సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Tirumala, 11 Apr. 21: In view of increasing covid cases across the country TTD has decided to dispense with the issuance of slotted Sarva darshanam tokens in Tirupati from April 12th onwards. 

It may be mentioned here that Shiridi Samsthan has already closed down darshan to its devotees owing to an increase in Covid cases in Maharashtra. As the temple city of Tirupati is also witnessing the increase in cases everyday TTD has decided to temporarily dispense with the issuance of SSD tokens in Bhu Devi Complex and Vishnu Nivasam in Tirupati to avoid gathering of devotees for SSD tokens in long few lines for hours together, which may facilitate in the spread of covid cases. 

Keeping in view the health security of devotees TTD has taken this decision. Any decision on issuing of tokens in future will be informed to the pilgrims in advance. The pilgrim devotees are requested to co-operate with TTD. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల  జారీ నిలిపివేత

తిరుమ‌ల‌, 2021 ఏప్రిల్ 11: దేశంలో కోవిడ్ -19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో  తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్‌డి) టోకెన్ల జారీ ప్ర‌క్రియ‌ ఆదివారం రాత్రి ముగుస్తుంది.

కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విష‌యం విదిత‌మే. తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్ర‌మేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో  సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్య‌లో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది.

ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. తదుపరి టోకెన్లు ఎప్పుడు జారీ చేసేది ముందుగా తెలియజేయడం జరుగుతుంది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.