SATTUMORA OF BHASHYAKARULU IN SRIVARI TEMPLE ON APRIL 21_ ఏప్రిల్‌ 21న శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తుమొర

Tirumala, 20 Apr. 18: The unique festival of Bhashyakarulavari Sattumura will be held on ?Saturday in a grand manner at Srivari temple as part of which Ubhaya Samarpana ritual is underway for19 days from April 12 to April 30.

In view of sattumora event the utsava idols of Sri Malayappa Swamy along with his consorts will be taken out in two separate Tiruchis on the mada streets in the evening and pradakshina inside Vimala Prakasam of the temple.

The sattumora for Bhashyakarulavaru and sallimpu with special ornaments will be performed later in the night in which the Jeeyar swamis and ekangulu will participate.

The TTD has cancelled the Vasanthotsavam event on Saturday in view of Bhashyakarulavari Sattumora.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 21న శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తుమొర

ఏప్రిల్‌ 20, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 21వ తేదీన శనివారం భాష్యకార్ల సాత్తుమొర జరుగనుంది. ఈ ఉత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 12 నుండి 30వ తేదీ వరకు 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగుతోంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వసంతోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.