SBI DONATES AMBULANCE VEHICLE TO TTD _ టిటిడికి రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్ విరాళం

TIRUMALA, 07 JANUARY 2023: The State Bank of India has donated an Ambulance Vehicle worth Rs.25lakhs to TTD on Saturday in front of Tirumala temple.

The Chairman of the Bank, Sri Dinesh Kumar Khara along with the TTD EO Sri AV Dharma Reddy performed the pujas to the vehicle and later handed over the keys to the TTD EO which will be utilized in SVIMS hospital.

SVIMS Director Dr Vengamma, CVSO Sri Narasimha Kishore, DI Tirumala Sri Janakirami Reddy, SBI Officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

టిటిడికి రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్ విరాళం

తిరుమల, 07 జనవరి 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్ ను శనివారం టిటిడికి విరాళంగా అందజేసింది.

ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట అంబులెన్స్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఛైర్మన్ శ్రీ దినేష్ కుమార్ ఖార అంబులెన్స్ తాళాలను టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో ఈ అంబులెన్స్ ను వినియోగించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, డిఐ శ్రీ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.