SCORES OF PILGRIMS GARUDA VAHANAM_ వైభ‌వంగా ఒంటిమిట్ట రాముల‌వారి గరుడసేవ

Vontimitta, 29 March 2018: The pleasant evening on Thursday witnessed give turn out of devotee crowd for Garuda Vahanam at Vontimitta.

Lord Sri Rama flames by God desa Sita Devi and Lakshmana Swamy on His either sides room celestial ride on Garuda Vahanam.

Usually in all Sri Vaishnavaite temples especially in those under the umbrella of TTD, during Garuda Seva Lord alone rides on the vehicle.

But it is only here at Vontimitta, Lord Sri Rama rides along with His spouse and beloved brother.

Temple AEO Sri Ramaraju and other staff members also took part in this celestial fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభ‌వంగా ఒంటిమిట్ట రాముల‌వారి గరుడసేవ

మార్చి 29, ఒంటిమిట్ట, 2018: శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో శ్రీ రామరాజు, సూపరింటెండెంట్లు శ్రీ సుబ్రమణ్యం, శ్రీ నాగరాజు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.