SEA OF HUMANITY TURNED OUT FOR PANCHAMI THEERTHAM_ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

GODDESS RECEIVES TULASI PATRA, MALA AND CORAL JEWEL HER B-DAY GIFT FROM LORD

Tiruchanur, 23 November 2017: All roads lead to pilgrim centre of Tiruchanoor on Thursday, to take part in the auspicious Panchami Theertham, with which the Navahnika Karthika Brahmotsavams of Goddess Padmavathi Devi concluded on a grand religious note.

CHOORNABHISHEKAM

Earlier during the day, before the Goddess was rendered with the celestial head bath-Abhyangana Snanam, Choornabhishekam was performed. The processional deity was seated in the Dhwaja Mandapam in side the Tiruchanoor temple and the Archakas performed this ritual chanting Sri Mantram and Sri Suktam. Later the Goddess was taken to Padma Sarovaram and seated on the special platform in Panchami Theertha Mandapam.

IN PANCHAMI MANDAPAM

Along with the Goddess, Sri Sudarshana Chakrattalwar, the anthropomorphic form of Lord was also seated aside and Snapana Tirumanjanam was performed. Initially, the Kankanabhattar Sri Archakam Vakulabharanam Srinivasa Manikantha Bhattar commenced the fete by invoking all the deities in nine Kalasas. Later the celestial ceremony started with Viswaksena Aradhana, followed by Punyahavachanam and other rituals.

PADI SARE FROM TIRUMALA

Meanwhile, the Srivari Padi Sare from Tirumala reached Panchamitheertha Mandapam on Thursday. The celestial gifts comprising Silk vatrams, vermilion, turmeric, sandal, garlands, jewels, laddu, vada, appam etc. were offered to Goddess Padmavathi Devi as a token of love from Lord Venkateswara on Her Birth Day. Tirumala JEO Sri KS Sreenivasa Raju handed over the sare to his Tirupati counterpart Sri P Bhaskar at pasupu Mandapam. From there he carried the sare to temple which was received by TTD EO Sri Anil Kumar Singhal.

TULASI PATRA HARAM DECKED

During Sanapana Tirumanjanam the Goddess is bein decorated with the jewels that were brought from Tirumala consisting Tulasi Patra haram weighing about 2.178kilos andCoral Kasula mala weighing around 118 grams. Every year Lord present precious jewels as His lady love’s birth day gift.

CHAKRASNANAM IN MAKARA LAGNAM

Kankana Bhattar Sri Archakam Vakulabharanam Srinivasa Manikantha Bhattar performed the rituals as per the tenets of Pacharatra Agama. The chakrasnanam was performed to Sri Sudarshana Chakrattalwar in the prescribed Makaralagnam.

VISUAL TREAT

It was a cynosure to the eyes to witness tens of thousands of devotees taking holy dip as soon as the holy disc was given a sacred dip in Padma Pushkarini.

ELABORATE ARRANGEMENTS BY TTD

TTD has made elaborate security and annaprasadam arrangements for the celestial fete.

Apart from TTD security, the police personnel deployed at different entry and exit points at pushkarini for devout management and see that no untowards incident takes place during Panchami Theertha Snanam.

On the other hand about 1.5lakh anna prasadam packets and 2 lakh water packets were distributed by Annaprasadam and health wings rwspectively.

Over 250 scouts and 250 srivari sevakulu also rendered impeccable services during the annual fete.

TTD MADARINS THANKS PILGRIMS

TTD EO Sri Anilkumar Singhal complimented Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna and other officers, police, panchayat for making the big event a grand success. He also thanked the pilgrims and locals for co-operating with TTD.

Later JEOs Sri P Bhaskar, Sri Srinivasa Raju, CVSO Sri A Ravikrishna also thanked pilgrims and complimented the workforce of TTD behind success of annual Karthika Brahmotsavams at Tiruchanoor.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

తిరుపతి, 2017 నవంబరు 23: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని పట్టపుదేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం నిర్వహించిన పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 6.30 గంటల నుండి 8.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 10 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. పంచమీ తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఖజానాలో ఉన్న అనేకానేక ఆభరణాల్లో రెండింటిని ”బంగారు తులసిపత్ర హారం, పగడాలు, కాసులు కూర్చిన బంగారు దండ” సారెతో పాటు తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

అనంతరం పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి. మధ్యాహ్నం 11.48 గంటలకు మకర లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించారు.

కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, చంద్రగిరి ఎంఎల్‌ఏ శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎంఎల్‌ఏ శ్రీమతి సుగుణమ్మ, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ దంపతులు, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విజివోలు శ్రీఅశోక్‌కుమార్‌ గౌడ్‌, శ్రీమతి సదాలక్ష్మి, శ్రీ రవింద్రారెడ్డి, ఏఈవో శ్రీ రాధాకృష్ణ, ఎవిఎస్‌వో శ్రీపార్థసారథిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

నవంబరు 24న పుష్పయాగం :

నవంబరు 24వ తేదీ శుక్రవారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసింది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు : టిటిడి ఈవో

తిరుచానూరులో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన టిటిడి అధికారులకు, సిబ్బందికి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అభినందనలు తెలియజేశారు.

తిరుచానూరులో గురువారం పంచమీతీర్థం అనంతరం ఈవో మాట్లాడుతూ బ్రహ్మెత్సవాలకు విశేష సంఖ్యలో వచ్చిన భక్తులకు సంతృప్తికరంగా అమ్మవారి మూలమూర్తితోపాటు వాహనసేవల దర్శనం కల్పించినట్టు తెలిపారు. పంచమీతీర్థానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు విభాగంతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరూ పుష్కరిణిలో పవిత్రస్నానాలు చేశారని తెలిపారు. ఇందుకు సహకరించిన పోలీసులకు, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, పంచాయతీ అధికారులకు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి అమ్మవారికి సారె

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మూత్సవాల్లో చివరిరోజైన గురువారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా గురువారం ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె గజాలపై ఊరేగింపుగా మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వరకు చేరుకుంది. అక్కడినుంచి తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్దకు సారెను తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు కలిసి ఈ సారెను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌కు అందించారు. అక్కడినుంచి భజనలు, కోలాటాలు తదితర కళాబృందాల నడుమ కోమలమ్మ సత్రం(ఆర్‌ఎస్‌గార్డెన్‌) చేరుకున్నారు. అనంతరం తిరుపతి పురవీధుల గుండా తిరుచానూరు పసుపు మండపానికి సారె చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు, అధికార గణంతో కలిసి ఊరేగింపుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణి వద్దకు సారె చేరుకుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.