SECOND DOSE COVAXIN TOKENS TO TTD EMPLOYEES _ కోవాగ్జిన్ రెండో డోస్ కు టీటీడీ ఉద్యోగులకు టోకెన్లు

Tirupati, 17 May 2021: TTD employees who are yet to have a second dose of Covaxin will be vaccinated on Tuesday and Wednesday by TMC officials.

The TMC has prepared the list of TTD employees who had the first dose. The employees who have completed the appropriate time period to have a second dose will get a phone call from TMC authorities.

Such employees shall have to go to Sachivalayam located in the Housing Board Colony in the 40th ward near Kanchi Mutt. Adhar Card is a must to get tokens for a vaccine. Vaccination will not be done to employees without tokens. Tokens will also be issued only as per the Vaccination time gap between first and second doses as prescribed by the Central and State governments.

The employees are requested to make note of the above guidelines.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కోవాగ్జిన్ రెండో డోస్ కు టీటీడీ ఉద్యోగులకు టోకెన్లు

తిరుపతి 17 మే 2021: కోవాగ్జిన్ రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన టీటీడీ ఉద్యోగుల జాబితాను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. వీరికి మంగళ, బుధవారాల్లో వ్యాక్సిన్ వేస్తారు.

ఉద్యోగులు మొదటి డోస్ వేసుకున్న రోజును పరిగణనలోకి తీసుకుని అధికారులు ఈ జాబితా సిద్ధం చేశారు. తిరుమల, తిరుపతిలో పని చేస్తున్న టీటీడీ ఉద్యోగులకు మున్సిపల్ సిబ్బంది నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన వారు కంచి మఠం సమీపంలోని హోసింగ్ బోర్డ్ కాలనీలోని 40వ వార్డు సచివాలయంలో ఆధార్ కార్డు చూపించి టోకెన్ పొందాలి. టోకెన్ లేని వారికి వ్యాక్సిన్ వేయరు. మొదటి డోస్ వేసుకున్న రోజు నుంచి రెండో డోస్ గడువును ప్రాధాన్యత క్రమంలో లెక్కించి మున్సిపల్ అధికారులు ఈ టోకెన్లు మంజూరు చేస్తున్నారు. ఉద్యోగులు ఈ విషయం గుర్తించి రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది