SECOND PHASE OF KALYANA KATTA SEVAKULU FROM APRIL 1 TO JULY 31 _ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు కల్యాణకట్టలో భక్తులకు ఉచిత సేవలందించనున్న కల్యాణకట్ట శ్రీవారిసేవకులు
ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు కల్యాణకట్టలో భక్తులకు ఉచిత సేవలందించనున్న
కల్యాణకట్ట శ్రీవారిసేవకులు
తిరుమల, 28 మార్చి – 2013 : వచ్చేనెల నుండి దేశవ్యాప్తంగా వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు కల్యాణకట్టలో ఉచిత సేవలను చేయడానికి ఏప్రిల్ 1 నుండి జూలై 31వ తేది వరకు కల్యాణకట్ట శ్రీవారిసేవకుల సేవలను తి.తి.దే వినియోగించుకోనుంది.
గత ఏడాది తి.తి.దే శ్రీవారి భక్తులకు తలనీలాలు తీసే సేవకుగాను నాయిబ్రాహ్మణులను శ్రీవారి సేవకులుగా తిరుమల శ్రీవారిసేవాసదన్‌లో పేర్లను నమోదు చేసుకోమని ఆహ్వానించిన సంగతి విదితమే. ఈ మేరకు 1100 మందికి పైగా కల్యాణకట్ట సేవకులుగా నమోదు అయిన కక్షురకర్మ సేవకులు భక్తులకు తలనీలాలు తీసేందుకు 2012 సెప్టంబరు 15వ తేది నుండి 2013 జనవరి 20వ తేది వరకు సేవలందించారు.
ఇదే క్రమంలో ఇది వరకే శ్రీవారిసేవలో సేవకులుగా నమోదు చేసుకొని సేవలందించిన కల్యాణకట్ట సేవకులనే తి.తి.దే వేసవి రద్దీ దృష్ట్యా మరో విడత ఆహ్వానించింది. అయితే తొలి విడతలో సేవలు నిర్వహించడంలో తి.తి.దే నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తి.తి.దే భద్రతా సిబ్బందిచేత పట్టుకోబడిన సేవకులను గుర్తించి తొలగించడమైనది. మిగిలిన వారిని మాత్రమే రెండవ విడత సేవకు ఆహ్వానించడమైనది.
కాగా కల్యాణకట్ట సేవకులు ఏ రోజు, ఏ సమయాన, ఎవరు, ఎక్కడ తమ సేవలను అందించాలో ఆ వివరాలను తి.తి.దే వెబ్‌సైట్ గీగీగీ.శిరిజీతిళీబిజిబి.ళిజీవీ లో పొందుపరచడమైనది. అదే విధంగా నమోదు పట్టికలను తిరుమల శ్రీవారిసేవాసదన్, ప్రధాన కల్యాణకట్ట మరియు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసంలలో కూడా అతికించడమైనది. కల్యాణకట్ట శ్రీవారి సేవకులు తదనుగుణంగా విధిగా భక్తులకు సేవలందించగలరు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.