SECOND TRIAL RUN OF GITA PARAYANA _ గీతా పారాయణం రెండో విడత ట్రయల్ రన్

Tirumala, 3 Sep. 20: The second trial run of Gita Parayanam held at Nada Neerajana Mandapam at Tirumala on Thursday evening. 

Vedic Scholar Sri Kuppa Vishwanatham presented a descriptive part while Veda Parayanmdar Sri Kasipathi rendered Bhagavat Gita Parayanam. 

Additional EO Sri AV Dharma Reddy and many exponents from Vedic studies offered their suggestions to improve the Gita Parayanam which included maintaining uniform tempo and pitch while reciting shlokas so that even the common devotees who are watching the programme live on SVBC or who are taking part in the live programme at Tirumala.

ISKCON representative Sri Leela Parayanadas thanked TTD for floating this idea of Bhagavat Gita Parayanam during this crisis period for the wellbeing of humanity. The artists from SV College of Music and Dance presented Madhrastam after Parayanam.

SVVU VC Sri S Sudarshana Sharma, Veda Vignana Peetham Principal Sri Avadhani, Annamacharya Project Director Sri Dakshinamurty, DyEO Sri Vijayasaradhi and others were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గీతా పారాయణం రెండో విడత ట్రయల్ రన్
 
తిరుమల, 2020 సెప్టెంబరు 03: తిరుమలలోని నాదనీరాజనం వేదిక పై గురువారం సాయంత్రం గీతా పారాయణం రెండో విడత ట్రయల్ రన్ జరిగింది.
 
వేదపారాయణందార్ శ్రీ కాశీపతి భగవద్గీత పారాయణం చేయగా, వేదపండితుడు శ్రీ కుప్పా విశ్వనాథం వ్యాఖ్యానం చెప్పారు. తిరుమలలో నేరుగా పాల్గొనే భక్తులతోపాటు ఎస్విబిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే సాధారణ భక్తులు సులువుగా పారాయణం చేసేలా శ్లోక పారాయణంలో తగిన జాగ్రత్తలు పాటించాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తోపాటు పలువురు పండితులు సూచనలు చేశారు.
 
ఇస్కాన్ ప్రతినిధి శ్రీ లీలా పారాయణ దాస్ మాట్లాడుతూ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మానవాళి సంక్షేమం కోసం భగవద్గీత పారాయణం చేయాలన్న టీటీడీ నిర్ణయాన్ని అభినందించారు. అనంతరం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు శ్రీకృష్ణునిపై ప్రముఖ సంస్కృత కృతి అయిన మధురాష్టకాన్ని ప్రదర్శించారు.
 
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య దక్షిణామూర్తి, డెప్యూటి ఈఓ శ్రీ విజయసారథి తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.