SECTOR WISE REVIEW BY EO (FAC) _ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై విభాగాల వారీగా ఈఓ సమీక్ష
Tirumala,31 December 2022: TTD EO(FAC) Sri Anil Kumar Singhal on Saturday conducted a department-wise review over the arrangements for Vaikunta Dwara Darshanam at Annamaiah Bhavan on Saturday.
Speaking on the occasion he directed officials of all sectors to be vigilant and ensure devotees a hassle-free and comfortable Vaikunta Dwara Darshan for ten days from January 2-11.
Among others, he tasked medical staff to position doctors, paramedics and ambulances near Srivari temple and other prominent locations, with priority to cleanliness, and install additional toilets etc the Queue lines in all regions from Narayanagiri sheds, VQC compartments, Krishna Teja Rest House to Shila Thoranam.
He instructed officials to provide a regular supply of Anna Prasadam, coffee and tea, and milk to devotees in queue lines and compartments besides coordination with police on security and vigilance at 9 ticket counters at Tirupati besides distribution of handbills and public address announcements at bus station, railway stations etc.
TTD Additional EO(FAC) Sri Veerabrahmam, JEO (H &E) Smt Sada Bhargavi, CVSO Sri Narasimha Kishore, SVBC CEO Sri Shanmukh Kumar, FA& CAO Sri O Balaji, CE Sri Nageswara Rao and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై విభాగాల వారీగా ఈఓ సమీక్ష
తిరుమల, 31 డిసెంబరు 2022: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వివిధ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లపై టిటిడి ఈఓ(ఎఫ్ఏసి) శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల్లో సిబ్బంది అప్రమత్తంగా పనిచేసేలా అధికారులు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయంతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో అదనంగా వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని, అంబులెన్సులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలని నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, కృష్ణతేజ విశ్రాంతి గృహం నుంచి శిలాతోరణం వరకు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, అదనపు మరుగుదొడ్ల వద్ద పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
తిరుమలలోని ఫుడ్ కౌంటర్లు, కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో భక్తులకు ఎప్పటికప్పుడు విరివిగా అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలను శ్రీవారి సేవకులతో అందించాలని సూచించారు. టిటిడి నిఘా, భద్రత అధికారులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలతో పాటు, తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో గల సర్వదర్శనం కౌంటర్ల వద్ద భద్రత, భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులు తిరుపతిలో టోకెన్లు పొంది తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలని అవగాహన కల్పించేందుకు తిరుపతిలోని బస్టాండు, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న కరపత్రాలు పంపిణీ, ప్రసారాలను నిరంతరం కొనసాగించాలన్నారు.
సమీక్షలో టిటిడి అదనపు ఈవో(ఎఫ్ఏసి) శ్రీ వీరబ్రహ్మం, జెఈఓ శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఎఓ శ్రీ బాలాజీ, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.