SEER TAKES PART IN ANJANADRI FETE _ లోక క‌ల్యాణార్థం ఆకాశ‌గంగ వ‌ద్ద ఆంజ‌నేయ‌స్వామివారికి పూజ‌లు

Tirumala, 06 June 2021: The Pontiff of Pushpagiri Mutt Sri Sri Sri Vidya Shankara Bharati Swami said the worship of Sri Anjaneya with abhisekam and pujas brings peace, health and prosperity to people.

He participated in the third-day festivities of Hanuman Jayanti being organised by the TTD at Akashaganga and lauded the TTD for its Akhanda Sundarakanda Parayanams for the welfare of humanity during Covid Pandemic.

Speaking to media later he said puranic evidences had conclusively displayed that Anjanadevi had performed penance at Anjanadri and begotten Anjaneya.

TTD Additional EO Sri AV Dharma Reddy, Vice-chancellor of Rashtriya Sanskrit University Acharya Muralidhara Sharma, TTD Vaikhanasa Agama advisor Sri Mohanarangacharyulu and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

లోక క‌ల్యాణార్థం ఆకాశ‌గంగ వ‌ద్ద ఆంజ‌నేయ‌స్వామివారికి పూజ‌లు

అంజ‌నాద్రిపై అంజ‌నాదేవి త‌ప‌స్సు చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తొంది : శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యా శంకర భార‌తి స్వామిజీ

తిరుమల, 2021 జూన్ 06: ఆకాశ గంగ తీర్థం వ‌ద్ద ఆంజ‌నేయ‌స్వామివారికి అభిషేకం, పూజ‌లు చేయ‌డం వ‌ల‌న లోకంలోని ప్ర‌జ‌లు సుఖ సంతోషాలు, ఆయురాగ్యాల‌తో ఉంటార‌ని శ్రీ పుష్ప‌గిరి మ‌ఠం పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యా శంకర భార‌తి స్వామిజీ తెలిపారు. ఆకాశ‌గంగ వ‌ద్ద టిటిడి నిర్వ‌హిస్తున్న హ‌నుమ‌జ్జ‌య‌తి వేడుక‌ల్లో భాగంగా మూడ‌వ రోజు ఆదివారం ఉద‌యం జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మానికి స్వామిజీ విచ్చేశారు.

అనంత‌రం స్వామిజీ మీడియాతో మాట్లాడుతూ లోక శ్రేయ‌స్సు కొర‌కు, ప్ర‌స్తుతం ఉన్న భ‌యాన‌క ప‌రిస్థితులు త‌గ్గి ఆంజ‌నేయ‌స్వామివారి క‌టాక్షంతో ప్ర‌జ‌లంద‌రు సంతోషంగా ఉండాల‌ని టిటిడి సుంద‌ర‌కాండ పారాయ‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. పురాణాలు ఆధారంగా తీసుకుంటే తిరుమల క్షేత్రంలోని అంజ‌నాద్రి కొండ‌పై అంజ‌నాదేవి త‌ప‌స్సు చేసినట్లు తెలుస్తోంద‌న్నారు. ప‌విత్ర‌మైన ఆకాశ గంగ తీర్థం వ‌ద్ద టిటిడి నిర్వ‌హిస్తున్న‌ హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌ల్లో మూడ‌వ రోజు అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌స్వామివారికి అభిషేకం, గ‌న్నేరు, క‌న‌కాంబ‌రం పుష్పాల‌తో పూజ‌, అర్చ‌న నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌ల సంతోషాన్ని, శాంతిని కోరుకుంటున్న టిటిడి యాజ‌మాన్యానికి ఆంజ‌నేయ‌స్వామివారి ప‌రిపూర్ణ అనుగ్ర‌హం క‌ల‌గాల‌న్నారు.

ఈ పూజా కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, ప్ర‌ముఖ పండితులు మ‌రియు టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌నరంగాచార్యులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

అనంత‌రం టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వ‌ర్యంలో క‌ళాకారుల బృందం ఉద‌యం 10 గంటల నుండి హ‌నుమ‌త్ సంకీర్త‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

జాపాలి

జాపాలి క్షేత్రంలో దాస‌సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారులు ఉద‌యం 10 నుంచి 11 గంటల వరకు హనుమాన్ చాలీసా ప‌ఠించారు. అనంత‌రం అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ స‌ర‌స్వ‌తి ప్ర‌సాద్‌ బృందం ఆంజ‌నేయ‌స్వామివారిపై సంకీర్త‌న‌ల‌ను ఆల‌పించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.