SEPARATE APP FOR SALE OF SRIVARI GOLD DOLLARS IN ONLINE- TTD EO _ శ్రీ‌వారి బంగారు డాల‌ర్ల‌ కొనుగోలుకు ఆన్‌లైన్‌లో చెల్లింపుల‌కు అవ‌కాశం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

INITIALLY TO IMPLEMENT FOR DONORS OF SRIVANI TRUST

Tirupati, 25 Dec. 19: As a part of its IT savvy move, TTD is all set to develop a separate app for the sale of Srivari Gold dollars in on-line, initially to start with donors of Sri Venkateswara Alaya Nirmana Trust (SRIVANI) under the instructions of TTD Executive Officer Sri Anil Kumar Singhal.

The thought emerged during the review meeting with senior officers by EO on IT in the TTD admin building on Wednesday.  The EO instructed the IT department to design an app to enable the devotees to purchase Srivari Gold Dollars in online. To start with, he directed them to enable this app for SRIVANI donors. “Those who wish to purchase dollars will pay in online and collect the dollar at Tirumala in the sales counter, he added.

He said the Govinda mobile app is getting ready for download on both android and Apple (iOS) phones to facilitate devotees for accessing all services of TTD. 

The EO directed IT officials, to design a Kind Donation Management system for facilitating donations in kind for all TTD temples and TTD managed institutions. 

He also instructed the officials to interlink the ERP applications with HR maps to facilitate the TTD employees. 

The EO also reviewed the status of the various IT applications designed for online admissions in to TTD educational institutions, Lease and rental management system, Donor management system, TTD calendars, Diaries online booking and TTD website etc.     

JEO Sri P Basant Kumar, CE Sri Ramachandra Reddy, Additional FA and CAO Sri Ravi Prasad, IT Chief Sri Sesha Reddy and other officials participated.    

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

శ్రీ‌వారి బంగారు డాల‌ర్ల‌ కొనుగోలుకు ఆన్‌లైన్‌లో చెల్లింపుల‌కు అవ‌కాశం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుప‌తి, 2019 డిసెంబ‌రు 25: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ప్ర‌తిమ‌తో కూడిన బంగారు డాల‌ర్ల కోనుగోలుకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేందుకు తొలిద‌శ‌లో శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తూ సాఫ్ట్‌వేర్ రూపొందించాల‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఐటి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఈవో  కార్యాల‌యంలో బుధ‌వారం ఉద‌యం ఐటి అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు.  

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ప్ర‌తి రోజు వేలాది మంది భ‌క్తులు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న కౌంట‌ర్ల నందు స్వామివారి బంగారు డాల‌ర్లు కొనుగోలు చేస్తున్నార‌న్నారు. ఇటీవ‌ల‌ ప్ర‌వేశ‌పెట్టిన శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌ల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంద‌ని తెలిపారు. శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌లు ద‌ర్శ‌నం టికెట్లు బుక్‌చేసుకునే స‌మ‌యంలో బంగారు డాల‌ర్ల‌కు ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేసేందుకు వీల‌వుతుంద‌న్నారు. దాత‌లు తిరుమ‌లకు చేరుకుని ఆల‌యం ఎదురుగా ఉన్నకౌంట‌ర్ల‌లో పొంద‌వ‌చ్చ‌న్నారు. మ‌లిద‌శ‌లో వెండి డాల‌ర్ల‌కు ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేసేందుకు సాఫ్ట్‌వేర్ రూపొందించాల‌న్నారు.

భ‌క్తులు ఎదురుచూస్తున్న గోవింద మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ల‌తో పాటు పిఒఎస్‌(ఆపిల్‌) ఫోన్ల‌లోను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీల‌వుతుంద‌న్నారు. ఈ మొబైల్ యాప్ ద్వారా భ‌క్తులు టిటిడి సేవ‌ల‌ను సుల‌భంగా పొంద‌వ‌చ్చ‌న్నారు. అదేవిధంగా టిటిడి ప‌రిధిలోని ఆల‌యాల‌కు, ఇత‌ర సంస్థ‌ల‌కు వ‌స్తువుల రూపంలో విరాళాలందించే దాత‌ల సౌక‌ర్యార్థం కైండ్ డొనేష‌న్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ పేరిట ప్ర‌త్యేక అప్లికేష‌న్ రూపొందించాల‌న్నారు. ఉద్యోగులకు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు హెచ్ఆర్‌మ్యాప్స్‌లోని స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు ఇఆర్‌పి అప్లికేష‌న్‌ అనుసంధానం చేయాల‌న్నారు.  

అనంత‌రం టిటిడి క‌ళాశాల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించిన ఆన్‌లైన్ అడ్మిష‌న్, లీజ్ మ‌రియు రెంట‌ల్ మేనేజ్‌మెంట్‌ సిస్ట‌మ్‌, డోనార్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌, క్యాలెండ‌ర్లు, డైరీలు ఆన్‌లైన్‌ బుకింగ్‌,  టిటిడి వెబ్‌సైట్‌, త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

ఈ స‌మావేశంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సిఇ శ్రీ రామ‌చంద్రారెడ్డి, అద‌న‌పు ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ ర‌విప్ర‌సాదు, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.