SERIES OF SPIRITUAL EVENTS LINED UP _ అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు
TIRUMALA, 05 OCTOBER 2022: A series of spiritual events have been lined up from the month of October onwards which includes Srinivasa Kalyanams, Venkateswara Vaibhavotsavams, Karthika Deepotsavams etc. said TTD Chairman Sri YV Subba Reddy.
Talking to media persons at Annamaiah Bhavan in Tirumala in Wednesday the Chairman said, From October 11-15, Venkateswara Vaibhavotsavams will be observed in Hyderabad followed by Srinivasa Kalyanams in Europe from October 15 to November 13.
Similarly, we have also plans to organise Srinivasa Kalyanams in agency areas like Rampachodavaram, Anakapalle, Araku etc.
The Chairman also said TTD is also contemplating to organise Karthika Deepotsavams in Yaganti and Vizag this year in the month of Karthika.
We will organise Venkateswara Vaibhavotsavams in Ongole in December and in January in New Delhi.
The Padmavathi Ammavaru temple at Chennai and Srivari temple at Jammu are also getting ready for Maha Samprokshanam next year, he maintained.
CANCER AWARENESS
The Chairman said, to bring awareness among TTD women employees about Cancer and related topics, a three-day conference will be organized in Mahati from October 7-9.
అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు
– కార్తీక మాసంలో విశాఖ, యాగంటిలో కార్తీక దీపోత్సవాలు
– టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
తిరుమల, 2022 అక్టోబరు 05: తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని, అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం మీడియా సమావేశంలో ఛైర్మన్ మాట్లాడుతూ అక్టోబరు 10న ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని, ఐదు రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు. వారపు సేవల్లో భాగంగా అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగుతుందని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
పవిత్రమైన కార్తీక మాసంలో గత ఏడాది తరహాలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని ఛైర్మన్ వెల్లడించారు. డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలులో, జనవరిలో ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తరాయణంలో చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ జరుగుతుందని వివరించారు. అహ్మదాబాద్ నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గుజరాత్ ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇచ్చిందని, త్వరలో భూమిపూజ చేస్తామని చెప్పారు. అక్టోబరు నెలలో ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామని తెలిపారు.
మహిళా ఉద్యోగులకు క్యాన్సర్ అవగాహన
టిటిడిలోని మహిళా ఉద్యోగులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు అక్టోబరు 7 నుండి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించనున్నాయని తెలిపారు. మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.