‘SERVE THE PILGRIMS WITH DEVOTION’-TTD EO_ తితిదేలో భద్రతా విభాగం అత్యంత కీలకం : ఈవో 

TIRUPATI, FEB 11:  The Vigilance and Security department plays a vital role in TTD among all the other departments in providing security to pilgrims as well to the world-famous temple of Lord Venkateswara.  Since the vigilance sleuths directly deal with the pilgrims, it, therefore, becomes the utmost responsibility of the vigilance wing to serve them with devotion said TTD EO Sri TTD EO Sri LV Subramanyam.
 
Addressing the training workshop for vigilance sleuths at SVETA in Tirupati on Monday, the TTD EO said, it is always been a sensitive issue to deal with the pilgrims and especially the vigilance sleuths should have the patience to deal with them without hurting their sentiments while discharging their duties.  
 
“Apart from your professional skills, everyone of you should develop a spiritual bend of mind, which will not only help you in self-enlightenment but also to serve the pilgrims with dedication”, he added.
 
In his address, TTD CVSO Sri GVG Ashok Kumar said, “With the advancement of technology, the unscrupulous elements in the society are also yielding to advanced system of attacks with electronic gadgets and there is an urgent need to tackle such attacks. The CCTV experts and intelligence department officials who arrived from Hyderabad will train you in the new mechanisms of how to fight back such attacks”, he added.
 
TTD Tirupati VGO Sri Hanumanthu, SVETA Director Sri Ramakrishna were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 
తితిదేలో భద్రతా విభాగం అత్యంత కీలకం : ఈవో

తిరుపతి, ఫిబ్రవరి 11, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొలువైన, ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తితిదేలో భద్రతా విభాగం అత్యంత కీలకమైందని కార్య నిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో రెండో బ్యాచ్‌ తితిదే నిఘా, భద్రతా సిబ్బందికి నాలుగు రోజుల పాటు జరుగనున్న శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ సామాన్య భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక భక్తిభావంతో భద్రతా సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. ఆధ్యాత్మికంగా చైతన్యవంతులైనప్పుడే మానసిక పరిపక్వత కలుగుతుందన్నారు. శ్రీవారి దర్శనానికి సత్పురుషులు, మహనియోగులు వస్తుంటారని, కావున ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూడాలని కోరారు. స్వామివారి సన్నిధిలో నిస్వార్థంగా విధులు నిర్వహిస్తే ఆయన కరుణిస్తారని, తద్వారా కుటుంబమంతా సుఖసంతోషాలతో ఉంటుందని చెప్పారు. ఈ శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరిలో వృత్తిపరంగా మార్పు రావాలని ఈవో ఆకాంక్షించారు.
తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఇటీవల కాలంలో దుండగులు ఆధునిక పరిజ్ఞానంతో విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి ఘటనలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సిబ్బందికి ఆధునిక శిక్షణ తప్పక అవసరమన్నారు. ఇందులో హైదరాబాదు నుండి ఇంటెలిజెన్స్‌ అధికారులు, సిసి కెమెరాల నిపుణులను రప్పించి మెళకువలు నేర్పిస్తున్నట్టు వివరించారు. శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను రోజువారీ విధుల్లో ఆచరణలో పెట్టాలని, అప్పుడే సత్ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో తితిదే విజిఓ శ్రీ హనుమంతు, శ్వేత సంచాలకులు డాక్టర్‌ కెవి.రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.
    
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.