SERVICE TO PILGRIMS IS SERVICE TO LORD-FORMER JEO MUKTHESWARA RAO _ భగవత్‌ కైంకర్యానికి తిరుమలకు మించిన ప్రదేశం లేదు – శ్రీ ముక్తేశ్వరరావు  

TIRUPATI, NOVEMBER 22: The former Joint EO of TTD, Sri Muktheswara Rao asked the employees to bless their lives in the service of pilgrims which will automatically fetch them divine bliss, as “Service to pilgrims is nothing but Service to Lord”.


 Addressing the training session of TTD employees in Sri Venkateswara
Employees Training Academy(SVETA), he said Tirumala is a place of eternal on the earth and is the best place to serve the pilgrims. “It is a golden opportunity which is unique only to the employees of TTD and you have to make use of this opportunity with utmost devotion and dedication”, he added.


He said the employees maintain cordial relations with the visiting pilgrims and provide them with required amenities. “A pilgrim has to leave this place with full satisfaction, which is possible only with your service”, he expressed.


In his address during the afternoon session, former EO, Sri PVRK Prasad said, “Never earn income out of way with greediness and jealousy as it will destroy us one day. Our motto is service to pilgrim and Lord. If we are sincere enough in our efforts, the Lord will surely take care of us”, he added.


Further, he said, selfless service to a pilgrim will give the utmost job satisfaction to an employee.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER OF TTD

 

భగవత్‌ కైంకర్యానికి తిరుమలకు మించిన ప్రదేశం లేదు – శ్రీ ముక్తేశ్వరరావు  


తిరుపతి, 2010 నవంబర్‌-22: భగవత్‌ కైంకర్యానికి తిరుమలకు మించిన అనువైన ప్రదేశం లేదని టిటిడి పూర్వపు జె.ఇ.ఒ. శ్రీ ముక్తేశ్వరరావు తెలిపారు. శ్వేతలో జరుగుతున్న టిటిడి ఉద్యోగుల శిక్షణా కార్యక్రమంలో సోమవారం ఉదయం ఆయన ప్రసంగించారు. తిరుమల క్షేత్రానికి అన్ని రకాల భక్తులు వస్తారని, భాగవతుల సేవ చేసుకోవడం పూర్వజన్మసుకృతమన్నారు.

శ్రీవారికి నిత్యసేవకులుగా ఉద్యోగులు మెలగాలన్నారు. తితిదేలో ఉద్యోగం చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహంతో పాటు భక్తుల మన్ననలు పొందవచ్చు అని ఆయన తెలిపారు. ఉద్యోగులగా మన మొదటి విధి భక్తులతో ప్రేమగా మెలగడం, వారి అవసరాలను గుర్తెరిగి వారికి సహాయపడడానికి కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఆయన ఉద్యోగులను కోరారు.

మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో శ్రీపి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ మాట్లాడుతూ శ్రీవారి సేవ చిత్తశుద్ధితో చేయాలన్నారు. ఇతరులు సంపాదిస్తున్నారనే భావనతో దేవునిపై నమ్మకాన్ని సడలించుకొని సంపాదించాలనే యావ సరైనది కాదని సూచించారు. దేవుని సన్నిధిలో శ్రద్ధాసక్తులతో పనిచేయాలని తద్వార భక్తులకు మనపై విశ్వాసం కలుగుతుందని, అదేవిధంగా మనకు కూడా మనం చేసే రోజువారి పనులలో పూర్తి సంతృప్తిని పొందవచ్చని ఆయన తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.