SERVICE WITH DEVOTION SHOULD BE YOUR ULTIMATE GOAL-TTD EO TO SEVAKULU_ భక్తిభావంతో సేవలందించి తిరుమల పవిత్రతను పెంచాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 24 September 2017: The motto behind introduction of Srivari Seva is to provide services to fellow pilgrims and your ultimate goal is to provide the best devoted services to pilgrims said TTD EO Sri Anil Kumar Singhal.

Addressing the Srivari Sevakulu and Scouts at Asthana Mandapam in Tirumala on Sunday, the EO said, that the Sevakulu are doing impeccable services. “But still more is expected from you and you should be able to give 100 per cent devoted services to the pilgrims”, he maintained.

Adding further the EO said, the recently introduced services in Vaikuntham queue complex like Help Desk, milk distribution, survey, providing medicines to pilgrims etc. are yielding good results. Similarly the temple cleaning service is one such service where in the sevakulu are doing the temple cleaning in the night shift like in Gurudwar where the devotees themselves render cleaning services of the temple premises.

“SEVA VILLAGE” IS OUR GOAL

The Srivari Seva should become a movement and it should reach the level of a “Seva Village” soon, aspired Tirumala JEO Sri KS Sreenivasa Raju. Addressing the Sevakulu and Scouts, the JEO said, a new building at a cost of Rs.70 crores is coming up exclusively for sevakulu. To encourage youth, employed and educated section also we are going to introduce three-day, four-day services from November on wards. Every day there is orientation classes by Sri Satya Sai Seva Organisation to enhance the quality of services by Sevakulu”, he added.

TTD PRO and Seva Sadan HoD Dr T Ravi, Devathanam Educational Officer and Scouts Head Sri Ramachandra, SSSSO Satsang team, Asst PRO Ms P Neelima and other Seva Sadan staff, over 2000 Sevakulu and Scouts were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

భక్తిభావంతో సేవలందించి తిరుమల పవిత్రతను పెంచాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఆస్థానమండపంలో శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సమావేశం

సెప్టెంబర్‌ 24, తిరుమల 2017: శ్రీవారి సేవకులు లౌకిక విషయాలను పక్కనపెట్టి భక్తిభావంతో సేవలందించాలని, తద్వారా పవిత్ర భావన పెరుగుతుందని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్ఘాటించారు. బ్రహ్మూెత్సవాల్లో సేవావిధులు నిర్వహించేందుకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు ఆదివారం తిరుమలలోని ఆస్థానమండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఈవో మాట్లాడుతూ భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులపై స్వామివారి క ప తప్పకుండా ఉంటుందన్నారు. బ్రహ్మూెత్సవాల్లో ఆయా విభాగాల్లో క్రమశిక్షణతో సేవలందించి, టిటిడి అధికారులకు, పోలీసులకు సహకరించాలని కోరారు. తిరుమల ఆదర్శవంతమైన పరిశుభ్రమైన ప్రాంతంగా ఎంపికైందని, దీనిని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రీవారిసేవకులు తగిన సూచనలను భక్తులకు అందించాలని సూచించారు. భక్తులు వేచి ఉండే కంపార్ట్‌మెంట్లలో ఏర్పాటుచేసిన హెల్ప్‌డెస్క్‌ల వద్ద శ్రీవారి సేవకులు భక్తులకు విశేషంగా సేవలందిస్తున్నారని తెలిపారు. శ్రీవారి ఆలయంలో నెల రోజులుగా అమలుచేస్తున్న ‘స్వచ్ఛసేవ’కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన శ్రీవారిసేవకులకు ఈవో ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. శ్రీవారి సేవకులను టిటిడిలో అవసరమైన చోట మాత్రమే వినియోగించాలని, ఆయా విభాగాల్లో పరిమితికి మించకుండా విధులు కేటాయించాలని శ్రీవారి సేవ అధికారులకు సూచించారు.

టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి సేవకుల కోసం రూ.70 కోట్లతో నిర్మిస్తున్న సేవా సదన్‌ నూతన భవనాన్ని ఈవో సూచనల మేరకు డిసెంబరు చివరినాటికి పూర్తి చేస్తామన్నారు. శ్రీవారి సేవకులు కేటాయించిన చోటే విధులు నిర్వహించాలని, చక్కటి సేవలందించి ఆదర్శవంతంగా నిలవాలని కోరారు. మరింత మంది భక్తులను శ్రీవారి సేవలో భాగస్వాములను చేసేందుకు 4 రోజులు, 3 రోజుల స్లాట్లు, ప్రత్యేక పర్వదినాల స్లాట్లను త్వరలో అమల్లోకి తీసుకొస్తామన్నారు. శ్రీవారి సేవకుల కోసం ప్రతిరోజూ ధ్యానం, భజనలు, సత్సంగం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు ప్రశాంతంగా వాహనసేవలు తిలకించేందుకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సహకరించాలన్నారు. అంతకుముందు శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, విద్యాశాఖాధికారి శ్రీ రామచంద్ర, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, శ్రీవారి సేవ ఏఈవో శ్రీ గోపాలరావు, శ్రీసత్యసాయి సేవా సంస్థ శిక్షణ సభ్యులు, దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 3000 మంది శ్రీవారి సేవకులు, వెయ్యి మంది సుశిక్షితులైన స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.