LORD MALAYAPPA AS SRI KRISHNA TAKES RIDE ON “VASUKI”_ వాహనంపై దర్బార్‌ కృష్ణుని రూపంలో మలయప్ప

Tirumala, 24 September 2017: As a part of the ongoing nine-day brahmotsavams at Tirumala on Sunday, the Lord Malayappa Swamy as Lord Sri Krishna took an elegant ride on the five hooded serpent King Chinna Sesha Vahanam.

SIGNIFICANCE:

During samudra Madhanam episode, when the deities and demons were churning the milk ocean for divine nectar, they used Serpent Vasuki as rope. By taking ride on this vehicle, the Lord enlightens pilgrims, that in spite of his mightiness, Vasuki Naga remained humble and patient for a good cause while Devatas and Asuras were churning the milk ocean using him as rope. So it gives a clear message that it is not our mightiness that makes us great but our patience and politeness.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Ex EO Sri L Subramanyam, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

2017 శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు_ చిన్నశేష వాహనంపై దర్బార్‌ కృష్ణుని రూపంలో మలయప్ప

సెప్టెంబర్‌ 24, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై దర్బార్‌ కృష్ణుని రూపంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావించడం కద్దు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

అనంతరం మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 7.00 నుంచి 8.00 గంటల వకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనున్నాయి. రాత్రి 9.00 నుంచి 11.00 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

చిన్నశేష వాహనసేవలో 4 ఆధ్యాత్మిక గ్రంథాల ఆవిష్కరణ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన 4 ఆధ్యాత్మిక గ్రంథాలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా|| తాళ్లూరు ఆంజనేయులు, సబ్‌ ఎడిటర్‌ డా|| నొస్సం నరసింహాచార్యులు, గ్రంథ రచయితలు పాల్గొన్నారు.

శ్రీవేంకటాచల మాహాత్మ్యము(స్కాంద పురాణాంతర్గతము)(మొదటి సంపుటం) :

తిరుపతికి చెందిన డా|| విష్ణుభట్ల గోపాలకృష్ణమూర్తి ఈ గ్రంథాన్ని రచించారు. ఇది వేంకటాద్రికి, ఆదివరాహక్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం. దీనికే శ్రీనివాసపురాణమని మరో పేరు కూడా ఉంది. ఇది తిరుమల, తిరుపతి, పరిసర క్షేత్రాలకు సంబంధించిన స్థానిక, పౌరాణిక, చారిత్రక విషయాలను గురించి విలువైన సమాచారాన్ని తెలియజేసే ప్రామాణిక గ్రంథం. ఇందులో వరాహావతారం, ఆయన భూమిని ఉద్ధరించడం, క్రీడాద్రిని వైకుంఠం నుంచి భువికి తెప్పించడం, శ్రీనివాసావిర్భావం, శ్రీపద్మావతీ శ్రీనివాసుల కల్యాణం, శ్రీవేంకటేశ్వర వైభవాన్ని సుందరంగా వర్ణించారు. అదేవిధంగా క్షేత్ర-దైవత-తీర్థ మాహాత్మ్యాలు, భక్తుల-ఋషుల చరిత్రలను కథల రూపంలో వివరించారు.

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం(తెలుగు వ్యాఖ్యానం) :

విజయవాడకు చెందిన డా|| వివి.వేంకటరమణ ఈ గ్రంథాన్ని రచించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారికి జరిగే ఎన్నో సేవలలో సుప్రభాతం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇందులో సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఉన్నాయి. ఈ శ్లోకాలను శ్రీ ప్రతివాద భయంకరణ్ణన్‌స్వామివారు రచించారు. విస్తృత ప్రచారం పొందిన ఈ సుప్రభాతం ఎంతో పేరు కలిగింది. తిరుమలలో నిత్యం పఠించే శ్రీవేంకటేశ్వర సుప్రభాతానికి డా|| వివి.వేంకటరమణ తెలుగులో సుందరమైన వ్యాఖ్యానం అందించారు. భక్తులందరూ దీన్ని అర్థం చేసుకుని పారాయణం చేయగలరని టిటిడి కోరుతోంది.

శ్రీవేంకటేశ్వరస్వామికే దర్శన్‌ (హిందీ అనువాదం) :

తిరుపతికి చెందిన డా|| ఐఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఈ గ్రంథాన్ని రచించారు. తిరుమలను సందర్శించే యాత్రికులు, భక్తులు తమ యాత్రలో స్వామిని ఎలా దర్శించాలి, ఏమేమి దర్శించాలి అనే విషయాలను తెలియజేసే పుస్తకమిది. ప్రధానంగా క్షేత్రదర్శనం, తీర్థదర్శనం, శ్రీస్వామివారి అర్చామూర్తి దర్శనం, ఉత్సవ దర్శనం ఇలా వరుసగా చేయాలని, అప్పుడే యాత్ర ఫలిస్తుందని, మళ్లీ మళ్లీ యాత్ర చేయాలన్న కుతూహలం కలుగుతుందని తెలియజేశారు. ఈ గ్రంథాన్ని తెలుగులో డా|| హెచ్‌ఎస్‌.బ్రహ్మానంద రాయగా డా|| ఐఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి హిందీలోకి అనువదించారు.

శ్రీవేంకటేశ్వరస్వామికే ఉత్సవ్‌ (హిందీ అనువాదం) :

తిరుపతికి చెందిన డా|| ఎంఆర్‌.రాజేశ్వరి ఈ గ్రంథాన్ని రచించారు. శ్రీవారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, సేవలు జరుగుతున్నాయి. వాటినే నిత్యోత్సవాలని, వారోత్సవాలనీ, మాసోత్సవాలనీ, సంవత్సరోత్సవానీ అంటారు. ఈ పుస్తకంలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఏడాది పొడవునా జరిగే సేవలను, ఉత్సవాలను శ్రీ జూలకంటి బాలసుబ్రమణ్యం సంక్షిప్తంగా వివరించగా, ఈ పుస్తకాన్ని డా|| ఎంఆర్‌.రాజేశ్వరి హిందీలోకి అనువదించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.