SERVICES OF SRIVARI SEVAKULU LAUDED _ శ్రీవారిసేవకు భక్తుల విశేషాదరణ
Tirumala, 4 Oct. 19: The pilgrims and officials of TTD lauded the impeccable services of Srivari Sevakulu who performed the best of their services during Garuda Vahana Seva on Friday.
Over 1500 Srivari Sevakulu have been deployed to offer services to the pilgrims sitting in galleries of four Mada streets at Tirumala. About 935 Sevakulu have been deployed for the distribution of Annaprasadam, another 610 for the Health Department to distribute water to pilgrims, 150 for the Vigilance department. This sevakulu ensured that every pilgrim sitting in the gallery gets food and water since morning.
Apart from this 1500 sevakulu, the volunteers who are deputed to outside lines also rendered impeccable services at Lepakshi circle, SMC area, TBC, Alwar Tank rest house points when the pilgrim line has stretched out on Friday morning.
TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy complimented the Srivari Sevakulu for their dedicated services to pilgrims.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారిసేవకు భక్తుల విశేషాదరణ
అక్టోబరు 04, తిరుమల, 2019: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన గరుడసేవను దర్శించుకునేందుకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు ఎంతో క్రమశిక్షణతో విశేషంగా సేవలందించారు. వర్షాన్ని సైతం పట్టించుకోకుండా భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండగా, శ్రీవారి సేవకులు వర్షంలోనూ భక్తిభావంతో సేవ చేశారు.
టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పర్యవేక్షణలో దాదాపు 1700 మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, విజిలెన్స్ విభాగాలకు సంబంధించి మాడ వీధుల్లోని వివిధ ప్రాంతాలలో భక్తులకు సేవలందించారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు టి, కాఫీ, పాలు, తాగునీరు, అల్పాహారం, మజ్జిగ, అన్నప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు. భక్తులు గ్యాలరీలలోనికి వచ్చేందుకు మాడ వీధులలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, గ్యాలరీలలోని ముఖ్యమైన ప్రాంతాలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు టిటిడి అధికారులకు, సిబ్బందికి సహకరించారు.
అదేవిధంగా, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, అక్షయ వంటశాల, పిఏసి-2లో శ్రీవారిసేవకులు ఆహారపొట్లాలు తయారుచేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా టిటిడి విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సహకారంతో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లలో విధులు నిర్వహించారు. అన్ని విభాగాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుండి విచ్చేసిన 3500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.