SESHA VAHANAM CARRIES NAGABHUSHANA _ శేష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి సాక్షాత్కారం

Tirupati, 17 Feb. 20: On the fourth day night as a part of ongoing annual fete in Sri Kapileswara Swamy temple in Tirupati on Monday evening, Sri Somaskanda took out celestial ride on Sesha Vahanam.

Sesha, the serpent king serves lord shiva and lord Vishnu in various forms there by indicating the concept of “Shivakesava Abedham”.

Devotees lined up to offer Harati during the procession of Sesha Vahanam. Temple officials participated in the procession, which was lead by Kolatam and Bhajan artistes. 

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati, other staff, devotees participated. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

శేష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి సాక్షాత్కారం

తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 17: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష‌(నాగ‌)వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. గజాలు, వృషభాలు ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు – ఆ ఆదిశేషునిపై భూమండలం – ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం, నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటోంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.