SESHA VAHANAM HELD _ శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

VONTIMITTA, 31 MARCH 2023: As part of the ongoing annual brahmotsavam at Vontimitta, one first day evening on Friday, Sesha Vahanam held.

Sri Sita Lakshmana sameta Sri Ramachandra Murty took a celestial ride along mada streets to bless devotees.

Deputy EO Sri Natesh Babu, Manuscripts Project Special Officer Smt Vijayalakshmi, Superintendents Sri Bala Subramanyam, Sri Venkatesayya were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం
 
ఒంటిమిట్ట, 2023 మార్చి 31: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన శుక్రవారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహనసేవ జరిగింది. 
 
ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్లు శ్రీ పి.వెంకటేశయ్య, శ్రీ ఆర్సీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.