SEVEN ICONIC BRAND AGARBATTIS TO PILGRIM FORE _ శ్రీ‌వారి స‌ప్త‌గిరుల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్ల‌తో భ‌క్తుల‌కు అందుబాటులో అగ‌ర‌బ‌త్తులు

TTD CHAIRMAN AND THE EO INAUGURATES AGARBATTIS

  • TTD signs MoU on Dry flower technology with YSR Horticultural University
  • Sapthagiri magazine released with added attractions

Tirumala, 13 Sep. 21: It was a great moment in history TTD with the inauguration of the Agarbatti Manufacturing Unit being opened at the SV Go Samrakshanashala on Monday.

 

The unique unit was opened by the TTD Chairman Sri YV Subba Reddy along with the TTD EO Dr KS Jawahar Reddy while Tirupati MLA Sri Bhumana Karunakar Reddy, Sulurpeta MLA Sri Sanjeevaiah also participated in the landmark event.

 

Thereafter they signed a pact with YSR Horticultural University for providing dry flower technology to TTD.

 

SEVEN BRAND AGARBATTIS

 

Speaking on the occasion the TTD Chairman said the agarbattis are being made from used flower garlands of all TTD temples and shall be available to devotees from Monday onwards at Tirumala. “The Bangalore based M/s Darshan international Company had set up machinery at its own cost and freely manufacturing Agarbattis as a service to Sri Venkateswara”, he added.

 

He said in all 10 machines produce 3.5 lakh agarbattis daily in seven brands which were sold at Tirumala laddu counters and Tirupati. The Chairman also reaffirmed that the flowers used in the Srivari temple are not used in making these agarbattis.

 

MOU WITH YSR HORTICULTURAL UNIVERSITY FOR DRY FLOWER TECHNOLOGY

 

The technology is used to make portraits of Swami and Ammavaru with the flowers used in the TTD temples. As part of the technology, women are trained at the Citrus Research Station of the University at Tirupati and TTD is funding  ₹ 83 lakhs towards equipment and training.

 

The Chairman said with the technology TTD manufactures photos, calendars, key chains, paperweights, etc. soon available for sale to devotees.

 

The Registrar of the YSR Horticultural University Dr Gopal, TTD DyEO (general) Sri Ramana Prasad signed the MoU which the TTD Chairman and Vice-chancellor Dr T Janakiram exchanged.

 

SALES OPENED IN TIRUMALA

 

Soon after the Agarbattis are opened in SV Gosala at Tirupati, the sales commenced at four counters in Tirumala with three counters near Laddu Complex and one in TTD Book Stall located opppsite Srivari Temple on Monday.

 

ATTRACTIVE SAPTHAGIRI MAGAZINE UNVEILED

 

TTD Chairman unveiled the TTD’s monthly Sapthagiri Magazine with added attractions of cover designs and scholarly articles published in six languages.

 

The Sapthagiri magazine which began in 1949 was issued in Telugu, Tamil, Kannada, English and Hindi in1970 and Sanskrit from 2014 onwards.

 

The Sapthagiri magazine has become totally colourful from 2016 and a leader in Hindu dharma propagation for last 50 years.

 

Additional EO Sri AV Dharma Reddy, TTD JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, Veterinary University Vice-Chancellor Dr Padmanabha Reddy, CE Sri Nageswara Rao, Gosala Director Dr Harnath Reddy, Darshan International Proprietor Sri Srinivas, Sri Ashok, Sri Harsha, Sapthagiri chief editor Sri Radha Ramana and other officials were also present in both the events.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి స‌ప్త‌గిరుల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్ల‌తో భ‌క్తుల‌కు అందుబాటులో అగ‌ర‌బ‌త్తులు

– వైఎస్ఆర్ ఉద్యాన‌ విశ్వ‌విద్యాల‌యంతో డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జిపై ఎంఓయు

– మల్టీ కలర్ లో స‌ప్త‌గిరి మాస ప‌త్రిక పునః విడుద‌ల

– టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌, 13 సెప్టెంబరు 2021: తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర గో సంర‌క్ష‌ణ‌శాల‌లో అగ‌ర‌బ‌త్తుల త‌యారీ కేంద్రాన్ని సోమవారం టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, తిరుప‌తి యం.ఎల్.ఏ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప్రారంభించారు. అనంత‌రం వైఎస్ఆర్ ఉద్యాన‌ విశ్వ‌విద్యాల‌యంతో డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జిపై ఎంఓయు కుదుర్చుకున్నారు. మల్టీ కలర్ తో ఆక‌ర్ష‌ణీయంగా రూపొందించిన స‌ప్త‌గిరి మాస ప‌త్రికను పునః ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ….

ఏడు బ్రాండ్ల‌తో అగ‌ర‌బ‌త్తులు –

టిటిడి ఆల‌యాల్లో స్వామి, అమ్మ‌వార్ల కైంక‌ర్యాల‌కు ఉప‌యోగించిన పుష్పాల‌తో స‌ప్త‌గిరుల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్ల‌తో ప‌రిమ‌ళ‌భ‌రితమైన అగ‌ర‌బ‌త్తులు త‌యారు చేసి సోమ‌వారం నుండి భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు. టిటిడి ఆల‌యాల్లో పూజ‌లు, అలంక‌ర‌ణ‌ల‌కు వినియోగించే పుష్పాలు వృథా కాకుడ‌ద‌ని అగ‌ర‌బ‌త్తుల త‌యారీని ప్రారంభించామ‌న్నారు. స్వామివారిపై ఉన్న భ‌క్తితో బెంగుళూరుకు చెందిన ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ స్వంత ఖ‌ర్చుల‌తో యంత్రాలు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియ‌మించుకుని అగ‌ర‌బ‌త్తులు త‌యారు చేసి టీటీడీ కి అందిస్తోంద‌న్నారు.

ఎస్వీ గోశాల‌లోని ప్లాంట్‌లో 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 ల‌క్ష‌ల అగ‌ర‌బ‌త్తుల త‌యారీ జ‌రుగు తోందన్నారు. టిటిడి ఎలాంటి లాభాపేక్ష లేకుండా అగ‌ర‌బ‌త్తులు విక్ర‌యిస్తుంద‌న్నారు. ఇందులో అభ‌య‌హ‌స్త, తంద‌నాన‌, దివ్య‌పాద‌, ఆకృష్టి, తుష్టి, దివ్య‌సృష్టి, దివ్య‌దృష్టి బ్రాండ్లు నేటి నుంచి తిరుమ‌ల ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద‌, త్వరలో తిరుప‌తిలోని వివిధ ప్రాంతాల్లో విక్ర‌యించ‌డానికి ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో వినియోగించే పుష్పాల‌ను అగ‌ర‌బ‌త్తుల త‌యారీలో వినియోగించ‌డం లేద‌ని ఛైర్మ‌న్ వివ‌రించారు.

డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన‌ విశ్వ‌విద్యాల‌యంతో డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జిపై ఎంఓయు –

టిటిడి ఆల‌యాల్లో వినియోగించిన పూల‌తో స్వామి, అమ్మ‌వార్ల ఫోటోలు త‌యారు చేయ‌డానికి డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు కుదుర్చుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇందుకోసం తిరుప‌తిలోని ఆ విశ్వ‌విద్యాల‌యంకు చెందిన సిట్రాస్ రిసెర్చ్ స్టేష‌న్‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రూ.83 ల‌క్ష‌ల‌తో ప‌రిక‌రాలు, శిక్ష‌ణ‌కు నిధులు టిటిడి స‌మ‌కురుస్తుంద‌ని, దీనికి బ‌దులుగా స్వామివారి ఫోటోలతో పాటు, క్యాలండ‌ర్లు, కీ చైన్లు, పేప‌ర్ వెయిట్లు, రాఖీలు, క్యాలండ‌ర్లు, డ్రై ఫ్ల‌వ‌ర్ మాల‌లు త‌దిత‌రాలు త‌యారు చేసి టిటిడికి ఇస్తార‌ని చెప్పారు. త్వ‌ర‌లో వీటిని భ‌క్తుల‌కు విక్ర‌యించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు.

ఉద్యాన‌ విశ్వ‌విద్యాల‌యం రిజిస్ట్రార్ డా. గోపాల్‌, టిటిడి జ‌న‌ర‌ల్ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ర‌మ‌ణ ప్ర‌సాద్ ఎంఓయుపై సంత‌కాలు చేశారు. ఎంఓయు ప‌త్రాల‌ను టిటిడి ఛైర్మ‌న్‌, ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి డాక్ట‌ర్ టి.జాన‌కిరామ్ మార్చుకున్నారు.

మల్టీ కలర్ తో ఆక‌ర్ష‌ణీయంగా స‌ప్త‌గిరి మాస ప‌త్రిక –

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో టిటిడి ఆర్ష ధ‌ర్మ ప్ర‌భోదం కోసం 1949వ సంవ‌త్స‌రంలో స‌ప్త‌గిరి ప‌త్రిక‌ను బులెటిన్‌గా ప్రారంభించింద‌ని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. 1970వ సంవ‌త్స‌రం నుండి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, ఆంగ్లం, హిందీ భాష‌ల్లో, 2014వ సంవ‌త్స‌రం నుండి సంస్కృత భాష‌లో ముద్ర‌ణ ప్రారంభ‌మైంద‌న్నారు. 2016వ సంవ‌త్స‌రం నుంచి స‌ప్త‌గిరిని పూర్తిగా రంగుల్లో పాఠ‌కుల‌కు అందిస్తున్నామ‌న్నారు.ఇప్ప‌టికి 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని ఆధ్యాత్మిక ప‌త్రిక‌ల్లో అగ్ర‌గామిగా ఉంద‌న్నారు.

స‌ప్త‌గిరి మాస ప‌త్రిక ఆరు భాష్ల‌ల్లో పునఃప్రారంభ‌మైంద‌ని, ఇందులో అనేక కొత్త శీర్షిక‌ల‌తో, ధారావాహిక‌ల‌తో పాఠ‌కుల‌కు నిరంత‌రాయంగా అందుతుంద‌ని చెప్పారు.

అంత‌కుముందు అగ‌ర‌బ‌త్తుల త‌యారీ ప్లాంట్ వ‌ద్ద శ్రీ‌వారి చిత్ర‌ప‌టానికి ఛైర్మ‌న్‌, ఎమ్మెల్యే, ఈవో, అద‌న‌పు ఈవోలు పూజ‌లు నిర్వ‌హించి ప్లాంట్‌ను ప్రారంభించారు. త‌రువాత ప్లాంట్‌లో అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసే యంత్రాల ప‌నితీరును ప‌రిశీలించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, సూళ్ళూరుపేట యం.ఎల్.ఏ శ్రీ సంజీవ‌య్య‌, ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డా.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, టీటీడీ సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, గో సంర‌క్ష‌ణ శాల డైరెక్డ‌ర్ డా.హ‌ర‌నాథ‌ రెడ్డి, ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప్రతినిధులు శ్రీ శ్రీ‌నివాస్‌, శ్రీ ఆశోక్‌, శ్రీ హ‌ర్ష, సప్తగిరి మాస పత్రిక ముఖ్య సంపాదకులు శ్రీ రాధా రమణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తిరుమలలో నాలుగు కౌంటర్లలో అమ్మకాలు ప్రారంభం

టీటీడీ తయారు చేయించిన అగరబత్తులు సోమవారం నుంచి తిరుమల లో భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచారు. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద మూడు కౌంటర్లు, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుస్తకాల విక్రయశాల వద్ద, ఒక కౌంటర్లో అగరబత్తుల విక్రయాలు ప్రారంభమయ్యాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.