SHOBHA YATRA OF BHAJANA MANDALS PERFORMED

Tirupati, 4 Jul. 19: The Shobha Yatra of Dasa Sahitya Bhajana Mandalis was performed in Tirupati on Thursday evening.

In connection with Traimasika Metlotsavam which commences frim Friday onwards, this fete was organised from Sri Govindaraja Swamy temple to III Chowltry.

The Metlotsavam fete will be observed under the aegis of TTD Dasa Sahitya Project from July 4-6. Special Officer of the Project Dr PR Anandatheerthacharylu is supervising the arrangements.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

తిరుపతి, 2019 జూలై 04: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర గురువారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భజన మండలి సభ్యులకు కొత్త సంకీర్తనలు నేర్పడం, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు.

సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద శ్రీవారి ప్రచారరథంలోని స్వామివారికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, తమిళనాడు, కర్ణాటక, కేర‌ళ రాష్ట్రాల నుండి 120 బృందాల్లో 2,500 మంది భజనమండళ్ల సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి భజనలు, కోలాటాలతో శోభాయాత్ర రైల్వేస్టేషన్‌ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకుంది. జూలై 6వ తేదీ శ‌నివారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అక్కడినుంచి భజన మండళ్ల సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ఏఈవో శ్రీ ర‌విప్ర‌కాష్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్, భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.