ANNUAL BTU POSTERS OF TALLAPAKA TEMPLES RELEASED_ తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

Tirupati, 4 July 2019: The annual Brahmotsavams of TTD sub-temple of Sri Chennakesava Swamy and Sri Siddheswara Swami temple at Tallapaka in YSR Kadapa district were released by Tirupati JEO Sri P Basanth Kumar on Thursday in his chambers in TTD administrative building in Tirupati.

The nine-day annual fete will commence from July 12-20 and Ankurarpanam will be performed on July 11 in both the temples.

Speaking on the occasion the JEO said that the important days include Dhwajarohanam on July 12, Garuda vahanam on July 16, Kalyanotsavam on July 17, Rathotsavam July 18, Chakrasnanam and Dhwajavarohanam on July 20 in Chennakesava Swamy temple.

At Siddheswara Swami temple, the main day in annual Brahmotsavams will commence with Dhwajarohanam on July 12, Kalyanotsavam and Gaja vahanam on July 17, Parveta Utsavam on July 18, Trishula Snanam and Dhwajavarohanam on July 20 and Pushpa yagam July 21.

DyEO Sri Elleppa, Superintendent Sri Hemasekhar and temple inspector Sri Anil Kumar were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి, 2019 జూలై 04: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌లను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ గురువారం ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ రెండు ఆలయాల బ్రహ్మోత్సవాలకు జూలై 11న‌ అంకురార్పణ జ‌రుగ‌నుంద‌ని తెలిపారు. శ్రీ చెన్నకేశవస్వామివారి ఆల‌యంలో జూలై 12న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ‌ని, రాత్రి చిన్నశేషవాహన సేవ జ‌రుగ‌నుంద‌ని చెప్పారు. జూలై 13న హంస వాహనం, జూలై 14న సింహ వాహనం, జూలై 15న హనుమంత వాహ‌నం, జూలై 16న ఉదయం మోహినీ అవతారం, గరుడసేవ జ‌రుగుతాయ‌ని తెలిపారు. జూలై 17న కల్యాణోత్సవం, గజ వాహనం, జూలై 18న రథోత్సవం, జూలై 19న అశ్వవాహనం, జూలై 20న వసంతోత్సవం, చక్రస్నానం, జూలై 21న పుష్ప‌యాగం నిర్వ‌హిస్తార‌ని వివ‌రించారు.

శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆల‌యంలో జూలై 12న ధ్వజారోహణం, హంసవాహనం, జూలై 13న చంద్రప్రభ వాహనం, జూలై 14న చిన్నశేష వాహనం, జూలై 15న సింహ వాహనం, జూలై 16న ఉదయం పల్లకీ సేవ అనంతరం చంద్రగ్రహణం కారణంగా మరుసటిరోజు మధ్యాహ్నం వరకు ఆలయ తలుపులు మూసివేస్తారని తెలిపారు. జూలై 17న ఆర్జిత కల్యాణోత్సవం, గజవాహనం, జూలై 18న పల్లకీ సేవ, జూలై 19న పార్వేట ఉత్సవం, జూలై 20న వసంతోత్సవం, త్రిశూలస్నానం, ధ్వజావరోహణం, జూలై 21న పుష్ప‌యాగం జ‌రుగ‌నుంద‌ని తెలియ‌జేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారని, ప‌రిస‌ర ప్రాంతాల భ‌క్తులు విచ్చేసి స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని జెఈవో కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, సూప‌రింటెండెంట్ శ్రీ హేమ‌శేఖ‌ర్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ అనిల్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.