SHOBHAYATRA OF LAKSHMI HARAM_ వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర కల్యాణవెంకన్నకు రూ.90 లక్షల విలువైన స్వర్ణ కడియాలు, భుజకీర్తులు, ముఖపట్టీ

Tirupati, 10 February 2018: The shobha yatra of Lakshmi Kasula Haram took place from TTD administrative building to Srinivasa Mangapuram temple on Saturday.

As a normal practice the precious jewel from Tirumala will be adorned to Kalyana Venkanna on Garuda Seva day every year.

Tirumala JEO Sri KS Sreenivasa Raju speaking on this occasion said, this year Two Kadiyams( bracelets) Two Bhujakeertis(shoulder ornaments) and a mukhapatti (another ornament) weighing around 3.180kilos of gold costing around Rs.90 lakhs has been presented to Kalyana venkateswara swamy on this auspicious occasion from Tirumala which will be used to deck the presiding deity at different occasions”, he added.

Tirumala temple DyEO Sri Harindranath, Srinivasa Mangapuram temple DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర కల్యాణవెంకన్నకు రూ.90 లక్షల విలువైన స్వర్ణ కడియాలు, భుజకీర్తులు, ముఖపట్టీ

ఫిబ్రవరి 10, తిరుపతి, 2018: తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర శనివారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఈ యాత్రను
ప్రారంభించారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాల్లో బ్రహ్మూెత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా గరుడసేవ నాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్షీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి 2 బంగారు కడియాలు, 2 భుజకీర్తులు, ఒక ముఖపట్టీ కానుకగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అందిస్తున్నట్టు వెల్లడించారు.

3.180 కిలోల బరువు గల ఈ ఆభరణాల ప్రస్తుత విలువ రూ.90 లక్షలని తెలిపారు.

ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం, ఆభరణాలను తిరుమల శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం ఇన్‌చార్జి శ్రీ గురురాజారావు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. ఈ ఆభరణాలకు శ్రీనివాసమంగాపురం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఏఈవో శ్రీ శ్రీనివాసులు స్వాగతం పలికారు.

ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్ర సాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, విఎస్‌వో శ్రీ
అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఎవిఎస్‌వోలు శ్రీ కూర్మారావు, శ్రీ గంగరాజు ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.