SHODASADINA SUNDARAKANDA PARAYANA DEEKSHA TO CONCLUDE ON OCTOBER 14 _ అక్టోబరు 14న ముగియనున్న షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష

Tirumala, 13 Oct. 20: The 16-day spiritual event, Shodasadina Sundarakanda Parayanam which was commenced on a religious note at Vasantha Mandapam in Tirumala on September 29 will conclude on October 14.

In this unique event, a 16-member team of Sundarakanda Upasakas have been reciting the shlokas from 68 Sargas of epic Sundarakanda from the past fifteen days. While another 16 Upasakas are doing Yagnam at Veda Vignana Peetham at Dharmagiri simultaneously. 

The Shodasakshara Mantram, “Raghavo Vijayam Dadyanma Sitapatihi Prabhuhu” – each syllable has some Beejaksharas and the total tallies to 68 that is equivalent to 68 Sargas. The Upasakas have been reciting the Shlokas from different Sargas based on the number that implies to each syllable from the Maha Mantra every day. 

On Wednesday, all the 2821 Shlokas from 68 Sargas will conclude. This program is being telecasted live on SVBC and followed and being received by millions of devotees across the globe.

  

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబరు 14న ముగియనున్న షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష 
 
తిరుమల, 2020 అక్టోబర్ 13: లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌ అక్టోబరు 14న బుధవారం ముగియనుంది. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో సెప్టెంబరు 29న ఈ దీక్ష ప్రారంభమైంది. 
 
“రాఘ‌వో విజ‌‌యం ద‌ద్యాన్మ‌మ సీతా ప‌తిఃప్ర‌భుః ” అనే మహామంత్రం ప్రకారం సుంద‌ర‌కాండ‌లోని మొత్తం 68 స‌ర్గ‌ల్లో గల 2,821 శ్లోకాల‌ను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 9 గంట‌ల నుండి ఒక గంట పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది. 
 
వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.
          
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.