SIGNING DECLARATION NON-HINDU PILGRIMS WILL COME UNDER IMPLEMENTATION FROM AUGUST 13-TTD JEO _ తిరుమలలో ఆగస్టు 13 నుండి అమల్లోకి రానున్న హైందవేతరుల డిక్లరేషన్ సంతకం విధానం
తిరుమలలో ఆగస్టు 13 నుండి అమల్లోకి రానున్న హైందవేతరుల డిక్లరేషన్ సంతకం విధానం
తిరుమల, 2012 ఆగస్టు 7: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించే ఇతర మతాలకు సంబంధించిన భక్తులు ఆగస్టు 13వ తేదీ నుండి తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తితిదే తిరుమల సంయక్త కార్యనిర్వ హణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (జిఓ ఎంఎస్ నంబరు 311 రెవెన్యూ ఎండోమెంట్స్ -1) నిబంధన 136 ప్రకారం హైందవేతరులు తిరుమలలోని శ్రీవారి ఆలయానికి వచ్చినప్పుడు వైకుంఠం నందు గల రిజిస్టర్లో స్వామివారిపై విశ్వాసం ఉన్నట్టు ఒక డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి ఉందన్నారు. అయితే ఇకపై తిరుమలోని జెఈఓ కార్యాలయం, పేష్కార్ కార్యాలయం, అదేవిధంగా అన్ని సబ్ ఎంక్వైరీ(ఉప విచారణ) కార్యాలయాల్లో ఆయా రిజిస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, కనుక ఇతర మతాలకు చెందిన భక్తులు స్వామివారి దర్శనానికి ముందు ఈ రిజిస్టర్లలో సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు. సదరు డిక్లరేషన్‌పై సంతకం చేయని వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీవారి దర్శనానికి అనుమతించరని ఆయన స్పష్టం చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.