SILK VASTRAMS PRESENTED TO ATTIVARADAR BY TTD _ కాంచీపురంలోని శ్రీ వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి టిటిడి ఈవో ప‌ట్టువ‌స్రాలు స‌మ‌ర్ప‌ణ‌

Kanchipuram 26 July 2019 ; TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala Special Officer Sri AV Dharma Reddy donated pattu vastrams on behalf of TTD to Sri Atti Varadar of Kanchipuram in Tamilnadu on Friday evening.

Speaking on this occasion, the EO said, it has been a great privilege for him to witness the Attivaradar which happens once in four decades. Last time in 1979, this unique event happened during the time of late Sri PVRK Prasad, who was the then EO of TTD. Now with the benign blessings of Lord Venkateswara, I happened to visit this great historical, ancient temple now”, he added.

The EO also complimented the pilgrim crowd management by the district and temple authorities. “The devotees are immensely satisfied with the very darshan of Sri Atti Varadar and the arrangements”, he observed.
Prinicipal Secretary Sri Phanindra Reddy, District Collector Sri Ponnaiah,Temple EO Sri Thyagarajar were also present


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కాంచీపురంలోని శ్రీ వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి టిటిడి ఈవో ప‌ట్టువ‌స్రాలు స‌మ‌ర్ప‌ణ‌

తిరుమల, 26 జూలై 2019 ; త‌మిళ‌నాడులోని ప్రముఖ పుణ్య‌క్షేత్ర‌మైన కాంచీపురంలోని శ్రీ వ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో 40 ఏళ్ల‌కు ఒక‌సారి ద‌ర్శ‌న‌మిచ్చే అత్తి వ‌ర‌ద‌రాజ‌స్వామివారి వేడుక‌లను పుర‌స్క‌రించుకుని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి శుక్ర‌వారం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న టిటిడి ఈవోకు ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ ఫ‌ణీంద్ర‌రెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ పొన్న‌య్య‌, ఆల‌య ఈవో శ్రీ త్యాగ‌రాజ‌ర్ ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు ఒకసారి జరిగే శ్రీ అత్తి వర‌ద‌రాజ‌స్వామివారికి సారె ఇవ్వడం త‌న అదృష్ట‌మ‌న్నారు. చివరిసారిగా 1979 లో ఈ ఉత్స‌వం నిర్వ‌హించ‌గా అప్ప‌టి టిటిడి ఈవో దివంగత శ్రీ పివిఆర్కె ప్రసాద్ అందించార‌ని తెలిపారు. ఇప్పుడు శ్రీ వేంకటేశ్వర‌స్వామివారి ఆశీర్వాదంతో చారిత్రక, పురాతన ఆలయాన్నిద‌ర్శించి, స్వామివారికి సారె అందించిన‌ట్లు వివ‌రించారు. జిల్లా, ఆలయ అధికారులు ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఏర్పాటు చేసిన క్యూలైన్లు, నిర్వహణను ఈవో అభినందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.