SILKS PRESENTED TO VAISHNAVA DIVYA DESAM _ తిరునిన్రవూరు శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పణ
TIRUMALA, 26 MARCH 2022: Tirumala Tirupati Devasthanams offered silk ‘Vastrams’ on behalf of Sri Venkateswara Swamy temple to the famed Sri Bhaktavatsala Perumal temple in Thiruninravur in Tiruvallur district of Tamil Nadu on Saturday.
The Pallava-era temple (late 8th century) is among the 108 Sri Vaishnava holy shrines called ‘Divyadesams’, where the presiding deity is worshipped as Bhaktavatsala Perumal and His Goddess as ‘Ennai Petra Thayar’. The shrine is located on the Tirupati-Chennai route.
TTD Additional Executive Officer AV Dharma Reddy carried the silk clothing on his head and presented it to the priests.
Tirumala Pedda Jeeyar Swamy, who administers the temple, was also present.
TTD officials were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరునిన్రవూరు శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పణ
తిరుమల, 2022 మార్చి 26: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరునిన్రవూరులో గల చారిత్రక పురాతనమైన శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఆలయానికి శనివారం సాయంత్రం టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ ఆలయానికి ఆధ్యాత్మికపెద్దగా వ్యవహరిస్తున్నారు. స్వామివారి కోరిక మేరకు 2010వ సంవత్సరం నుండి ఈ ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి శ్రీవారి కానుకగా పట్టువస్త్రాలు సమర్పిస్తోంది.
ముందుగా తిరునిన్రవూరులోని శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠానికి టిటిడి అదనపు ఈవో చేరుకున్నారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పించారు. తిరు అనగా ‘శ్రీ లక్ష్మీ’ అని, నిన్ర అనగా ‘నిలబడి’ అని, వూరు అనగా ‘ప్రదేశం’ అని అర్థం. శ్రీలక్ష్మీదేవి నిలబడి ఉన్న ప్రదేశంగా తిరునిన్రవూరు గుర్తింపు పొందింది. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం ఒకటి.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.