SILVER THRONE DONATED TO SRI KRT_ శ్రీ కోదండరామాలయానికి వెండి సింహాసనం

Tirupati, 26 February 2018: A Silver-plated Throne with a teak wood frame costing Rs 53 lakhs in which 127.450 kg of silver was today presented by the TTD to the Sri Kodanda Rama Swamy Temple.

The throne prepared by the jewelry section of the old Huzur office of TTD was presented to officials of the temple this evening after special rituals and the same will be utilized for the Sitarama Kalyanama and Sri Rama Pattabhisekam events hereafter.

Temple DyEO Smt Jhansi Rani, Jewelry Section AEO Sri Rajendra, Temple superintendent Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and others participated.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI.

శ్రీ కోదండరామాలయానికి వెండి సింహాసనం

ఫిబ్రవరి 26, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి వెండి సింహాసనాన్ని టిటిడి తయారుచేయించి సోమవారం అందజేసింది. టేకు కొయ్యతో రూపొందించిన ఆకృతిపై వెండి రేకులను అమర్చి సింహాసనాన్ని రూపొందించారు. ఇందుకోసం రూ.53 లక్షలు విలువైన 127.450 కిలోల వెండిని వినియోగించారు.

తిరుపతిలోని పాత హుజుర్‌ ఆఫీసు ప్రాంగణంలో గల జ్యువెలరీ విభాగంలో తయారుచేసిన ఈ సింహాసనాన్ని సాయంత్రం ఆలయానికి తీసుకొచ్చి అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీ రామ పట్టాభిషేకం ఉత్సవాల్లో ఈ సింహాసనాన్ని వినియోగిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కోదండరామాలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, జ్యువెలరీ విభాగం ఏఈవో శ్రీ రాజేంద్ర, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.