SADACHARAM CLASSES COMPLETE IN TTD SCHOOLS_ టిటిడి పాఠశాలల్లో ముగిసిన సదాచారం తరగతులు

Tirupati, 26 February 2018: The unique Sadacharam training classes for students of TTD run schools importing dharmic culture, aesthetics, ethics, moral and human values concluded today.

The special tutoring classes which commenced from January 2018 concluded today at a simple ceremony in schools wherein they were given handbooks of Ugadi, Sri Rama Navami, Shubha Prada Dipika and Dharma parichayam ‘published by the TTD.

Sri A Ramakrishna Reddy, Secretary of HDPP participated at the valedictory event in the SV High school. Sri G Chenna Keshavulu Naidu, Epic studies OSD participated in the Kodandarama Swamy High school, Epic studies OSD Dr G Damodar Naidu participated in the Sri Padmavati Girls High School, Sri R Nageswar Rao, HDPP AEO participated in the SV Oriental High school, HDPP Superintendent Sri MR Gurunath at Tatitopu SKS High school and Sri M Munikrishnaiay HDPP coordinator at SV High School, Tirumala


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI.

టిటిడి పాఠశాలల్లో ముగిసిన సదాచారం తరగతులు

ఫిబ్రవరి 26, తిరుపతి, 2018: టిటిడి ఆధ్వర్యంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ధార్మిక, నైతిక, మానవీయ విలువలను బోధించేందుకు ఉద్దేశించిన సదాచారం శిక్షణ తరగతులు ఈ విద్యాసంవత్సరానికి గాను సోమవారం ముగిశాయి. ఈ ఏడాది జనవరి నుండి ప్రతి సోమవారం అన్ని పాఠశాలల్లో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా విద్యార్థులకు ”ఉగాది, శ్రీరామనవమి, శుభప్రద దీపిక, ధర్మపరిచయం” పుస్తకాలను పంపిణీ చేశారు.

తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్‌లో జరిగిన ముగింపు కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీఎ.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో ఎపిక్‌ స్టడీస్‌ ప్రత్యేకాధికారి డా|| జి.దామోదరనాయుడు, శ్రీ కోదండరామస్వామి హైస్కూల్‌లో హెచ్‌డిపిపి కో-ఆర్డినేటర్‌ శ్రీ జి.చెన్నకేశవులునాయుడు, ఎస్వీ ఓరియంటల్‌ హైస్కూల్‌లో హెచ్‌డిపిపి ఏఈవో శ్రీ ఆర్‌.నాగేశ్వరరావు, తాటితోపులోని ఎస్‌కెఎస్‌ హైస్కూల్‌లో హెచ్‌డిపిపి సూపరింటెండెంట్‌ శ్రీ ఎం.ఆర్‌.గురునాథ్‌, తిరుమలలోని ఎస్వీ హైస్కూల్‌లో హెచ్‌డిపిపి కో-ఆర్డినేటర్‌ శ్రీ ఎం.మునికృష్ణయ్య పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.