SITA RAMA KALYANAM OBSERVED IN GRANDEUR  _ అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల‌ క‌ల్యాణం

VONTIMITTA IMMERSES IN DEVOTIONAL VIBES

VONTIMITTA, 22 APRIL 2024: All roads led to the temple centre of Vontimitta on Monday evening with scores of devotees making a beeline to Kalyana Vedika where the celestial wedding of Sri Sita Rama Kalyanam took place with utmost celestial grandeur.

The tens of thousands of devotees were spell bound with the divine charm of the celestial wedding ceremony. 

The venue appeared as sea of humanity with the devotees occupying every inch of the galleries.

The entire temple centre echoed to the divine chants of Jai Sri Ram with devotion touching the peaks.

Kalyanam Kamaneeyam

The celestial marriage commenced at 6:30pm in the temple with Bhagavat Vignapanam and lasted up to 8:30pm, followed by a series of ritual procedures including Anugna, Sankalpam, Punyahavachanam as per the tenets of Pancharatra Agama in the auspicious Lagnam.

Kalyanam Rituals

After this, Raksha Bandhanam was performed by the Archakas under the directions of Archaka Chief Sri Rajesh Bhattar followed by Yagnopaveeta Dharana, Kanyavaranam, Madhuparkarchanam.

The priests later performed Kanyadanam and read out the ancestral tree of both the Bride and the Bridegroom. 

This is followed by the priests reciting Mangalastakam, Choornika.

After all the series of rituals, the much awaited episode, Mangalyasutra Pooja, Mangalyasutra Dharana, Akshataropanam were performed with utmost religious fervour amidst chanting of Vedic hymns by the priests. The celestial fete completed after Nivedana, Veda Swasti, Mahada Aseervachanam.

Jewels Displayed

The 13 jewels presented to Vontimitta Kodanda Rama have been displayed and read out by the priests on the occasion.

Edurkolu held

The traditional Edurkolu ritual with both the Bride and Bridegroom facing one another on separate Tiruchis was performed.

Talambralu and Laddus distributed 

Each devotee is given the Talambralu, Laddus, Kankanams, Akshatalu kits and after Kalyanam distributed Pulihora and Sweet Pongali prasadams in food counters.

Under the supervision of sectoral officers and gallery staff and with the support of Srivari Sevaks and Scouts the entire distribution activity has been carried out in a hassle free manner.

Special CS Sri Karikalavalavan, Special CS Sri SS Ravat, and other dignitaries including Sri Girija Shankar, Collector Sri Vijayaramaraju,  Upalokayukta Judge Justice Rajani, District Judge Justice Sridevi, Joint Collector Sri Ganesh Kumar, SP Sri Siddharth Kaushal and others were present.

TTD EO Sri AV Dharma Reddy, JEOs Smt Goutami, Sri Veerabrahmam and other senior officers of TTD, devotees were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల‌ క‌ల్యాణం

– వేలాదిగా హాజరైన భక్తులు

– భ‌క్తులంద‌రికి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 22: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జ‌రిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి క‌ల్యాణోత్స‌వాన్ని తన్మయత్వంతో తిల‌కించారు.

రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 5.30 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. రాత్రి 6 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.

సాయంత్రం 6.30 గంటలకు కంకణబట్టర్‌ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త‌యింది.

వైభవంగా శ్రీ సీతారాముల ఉత్సవర్ల శోభాయాత్ర

స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర ఆలయం నుండి కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

భ‌క్తులంద‌రికి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ

కల్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భ‌క్తులంద‌రికి శ్రీ‌వారి సేవ‌కులు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన త‌లంబ్రాల‌ను పంపిణీ చేశారు.

అన్నప్రసాదాలు పంపిణీ

శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం వేలాది మంది భక్తుల కోసం వేదికకు ఇరువైపులా ఏర్పాటుచేసిన 150 కౌంటర్లలో సెక్టార్ అధికారుల పర్యవేక్షణలో శ్రీవారి సేవకులు
పులిహోర, చక్కెర పొంగలి అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక సి.ఎస్ లు శ్రీ క‌రికాల‌వ‌ల్ల‌న్, శ్రీ ఎస్.ఎస్.రావత్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గిరిజ శంకర్, టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి దంపతులు, వైఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు, ఉప లోకాయుక్త శ్రీమతి రజని, జిల్లా జడ్జి శ్రీమతి శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది