SITARAMA KALYANAM ON APRIL 22 BETWEEN 6:30PM AND 8:30PM IN A GRAND WAY-EO _ ఏప్రిల్ 22న ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు- టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Vontimitta, 12 April 2024: Elaborate arrangements have been made for the ensuing annual Sri Rama Navami Brahmotsavams in Vontimitta and the state festival of Sri Sitarama Kalyanam will be held on April 22 between 6:30pm and 8:30pm said, TTD EO Sri AV Dharma Reddy.
Speaking to the media on Friday here he said in view of the annual event, the traditional temple cleansing fete, Koil Alwar Tirumanjanam was observed. The annual Brahmotsavam will commence on April 16 with Ankurarpanam followed by Dhwajarohanam on April 17 on the day of the Srirama Navami festival and concludes on April 25, he added.
He said TTD along with the local district administration made arrangements keeping in view the heavy turnout of pilgrims and scorching temperatures.
The EO said, permanent structures have been built at Kalyana Vedika and arrangements for drinking water, Annaprasadam have been made at galleries and entry points. Both the police and TTD security will ensure safety measures towards incident free event.
District Collector Sri Vijayaramaraju instructed the officials concerned to complete the pending works including barricading, erection of CC cameras, Public Address System before April 15.
Later the EO along with the district and TTD officials inspected the ongoing arrangements at Kalyana Vedika.
On behalf of district administration, Joint Collector Sri Ganesh Kumar, SP Sri Siddharth Koushal, Municipal Commissioner Sri Suryasai Praveen Chand and other officials were also present.
While from TTD, JEO Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 22న ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
– ప్రతిష్టాత్మకంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు
– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
ఒంటిమిట్ట, 12 ఏప్రిల్ 2024: ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పగడ్భంది ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్ తో కలసి శుక్రవారం ఈవో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పిఏసిలోని సమావేశ హాలులో ఈవో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు జరిగే శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ, జిల్లా యంత్రాగంతో సమన్వయం చేసుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. కల్యాణానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, విరివిగా అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటర్లలోను, గ్యాలరీలలో ఉన్న భక్తులకు ప్రసాదాల పంపిణీకి అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
భద్రత, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు, కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు, కల్యాణోత్సవం సందర్బంగా విద్యుదీకరణ అంశాలు, అగ్నిమాపక వాహనం, వైద్య ఆరోగ్యశాఖ వారిచే వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు తదితర అంశాల పై సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఈ ఏడాది భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించినట్లు చెప్పారు.
జిల్లా యంత్రాంగం తరపున వివిధ శాఖల అధికారులకు, టీటీడీ తరపున ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. వాటిని సమన్వయంతో పూర్తి చేసి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు.
అనంతరం కలెక్టర్ శ్రీ విజయరామరాజు మాట్లాడుతూ, ఏప్రిల్ 15వ తేదీ లోపు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ఎపిఎస్ ఆర్‌టిసి ద్వారా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేదిక వద్ద గ్యాలరీలు, పటిష్టమైన బ్యారికేడ్లు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయలన్నారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్ సిబ్బంది, మందులు, అంబులెన్సులు, గ్లూకోజ్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, కడప మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రవీణ్ చంద్, ఎస్వీబిసి సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, టీటీడీ సిఈ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో శ్రీ నటేష్‌బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.