WOODEN CHARIOT PROCESSION HELD _ వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

Tirupati, 12 April 2024: Sri Kodandarama temple Chariot Utsavam was observed with religious splendour in Tirupati on Friday.

As part of the annual Brahmotsavam of Tirupati Sri Kodandaramaswamy on a penultimate day, the Chariotsavam was held in full splendour with devotees competing themselves to pull the massive wooden chariot along the streets chanting divine names.

From 7am to 9am the event was held wherein Sri Seethalakshmana sameta Sri Ramachandra took the celestial ride seated majestically inside the chariot to bless His devotees.

From 3 pm to 4 pm, the priests will conduct Tirumanjanam and Asthanam.  

Tirumala Sri Sri Peddajiyarswamy, Sri Sri Chinnajiyarswamy, Deputy EOs Sri Govinda Rajan, Smt. Nagaratna, AEO Sri Parthasaradhi, Superintendent Sri Somesekhar, Engineering, Police, Vigilance officers and a large number of devotees participated in the Chariot procession.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

తిరుపతి,2024 ఏప్రిల్ 12: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే.

మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, ఇంజనీరింగ్, పోలీస్, విజిలెన్స్ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 13న చక్రస్నానం

శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరుగనుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.