SIX MORE VOLUMES RELEASED UNDER DASA SAHITYA SARVASVA _ దాస సాహిత్య సర్వస్వ ఆరు సంపుటాలు ఆవిష్కరించిన టీటీడీ ఈవో
Tirumala, 4 February 2022: TTD EO Dr KS Jawahar Reddy along with the Additional EO Sri AV Dharma Reddy released six volumes under Dasa Sahitya Sarvasva on Friday.
This book release event took place in Annamaiah Bhavan at Tirumala. Speaking on the occasion the EO said TTD commenced bringing to light the great works by Kannada Dasas in the form of literature for the sake of common public in 2021.
During last year two volumes of 500 Sankeertans penned by Sri Sripadaraja Theerthulu and Sri Vyasaraja Theerthulu were released under Dasa Sahitya Sarvasva. “Today we are releasing six more volumes including four volumes of Sri Purandhara Dasa consisting 1000 Sankeertans and another two volumes of Sri Vadiraja Theertha consisting 500 Sankeertans.
Dasa Sahitya Project Special Officer Sri PR Anandatheerthacharyulu was also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
దాస సాహిత్య సర్వస్వ ఆరు సంపుటాలు ఆవిష్కరించిన టీటీడీ ఈవో
తిరుమల, 2022 ఫిబ్రవరి 04: దాససాహిత్య సర్వస్వ పేరుతో ఆరు సంపుటాలను టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి తో కలిసి శుక్రవారం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి 1979లో దాస సాహిత్య ప్రాజెక్ట్‌ను టీటీడీ ఏర్పాటు చేసిందన్నారు. అప్పటి నుండి దాస వాజ్ఞ్మయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.
ప్రముఖ కర్ణాటక సంగీత దాస సాహిత్య తత్త్వవేత్తలైన శ్రీ వ్యాస రాజతీర్థులు, శ్రీ శ్రీపాదరాజతీర్థులు, శ్రీ పురందర దాసులు, శ్రీ వాదిరాజ తీర్థులు వంటి వారి సంకీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
2021లో సామాన్య ప్రజల కోసం కన్నడ దాసుల గొప్ప రచనలను సాహిత్య రూపంలో వెలుగులోకి తీసుకురావడాన్ని టీటీడీ “దాస సాహిత్య సర్వస్వ” పేరుతో ప్రారంభించిందన్నారు.
గత సంవత్సరం శ్రీ శ్రీపాదరాజ తీర్థులు మరియు శ్రీ వ్యాసరాజ తీర్థులు రచించిన 500 సంకీర్తనలతో దాస సాహిత్య సర్వస్వ రెండు సంపుటాలు ఆవిష్కరించినట్లు చెప్పారు.
శ్రీ పురంధర దాసుల వారు రచించిన 1000 సంకీర్తనలతో నాలుగు సంపుటాలు, శ్రీ వాదిరాజ తీర్థులవారి 500 సంకీర్తనలతో కూడిన రెండు సంపుటాలు సహా మొత్తం ఆరు ప్రచురణలను భక్తులకు అందుబాటులోకి నేడు తీసుకురావడం జరిగింది అని ఆయన వివరించారు.
దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ పిఆర్ ఆనందతీర్థాచార్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.