SIX TAKE OATH _ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం

TIRUMALA, 30 AUGUST 2023: Six more took oath as TTD Trust Board members on Wednesday in Tirumala temple.

 

TTD JEO Sri Veerabrahmam has administered oath to all of them in the Sanctum Sanctorum that included Sri Karikala Valaven, Special Chief Secretary Endowments as ex-officio, Sri Yellareddigari Sitarama Reddy, Sri Balasubramanian Palanisamy, Sri R. Venkata Subba Reddy, Sri Siddavatam Yanadaiah, Sri Sidda Veera Venkata Sudheer Kumar as members of the board.

 

Later they were rendered Vedasirvachanam at Ranganayakula Mandapam. The JEO offered theertha prasadams and presented them laminated photos of Srivaru.

 

DyEOs Sri Lokanatham, Sri Govindarajan, Sri Harindranath and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం

 తిరుమల, 2023 ఆగస్టు 30: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా బుధవారం ఆరుగురు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కరికాలవలవన్ ఎక్స్అఫీషియో సభ్యులుగా, శ్రీ వై.సీతారామిరెడ్డి, శ్రీ బాలసుబ్రమణియన్ పళనిస్వామి, శ్రీ ఆర్.వెంకటసుబ్బారెడ్డి, శ్రీ సిద్దవటం యానాదయ్య, శ్రీ సిద్ధా వీరవెంకట సుధీర్ కుమార్ ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ గోవిందరాజన్, శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.