POURNAMI GARUDA SEVA CANCELLED ON AUGUST 31 _ ఆగస్టు 31న శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి శ్రీ మలయప్పస్వామి
MALAYAPPA TO VISIT VIKHANASA SANNIDHI
TIRUMALA, 30 AUGUST 2023: TTD has cancelled Pournami Garuda Seva on August 31 owing to Vikhanasa Mahamuni Jayanti festivities.It is an agamic tradition that Sri Malayappa visits Sri Vikhanasa Mahamuni Sannidhi located at North Mada street in Tirumala after the Sahasradipalankara Seva on the next day of the Vikhanasa Jayanti.
The regular rituals, services and festivals in Srivari temple that are being observed all through the year were based on the principles penned by Sage Sri Vikhanasa Maharshi the founder of Vaikhanasa Agama Shastra.
TTD has cancelled the Purnami Garuda Seva scheduled to be held on Thursday, August 31 due to this special festival. Devotees are requested to make note of this.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 31న శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి శ్రీ మలయప్పస్వామి
– పౌర్ణమి గరుడ సేవ రద్దు
తిరుమల, 2023 ఆగస్టు 30: ఆగస్టు 31న గాయత్రి జపాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు గురువారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం ఉత్తర మాడ వీధిలో గల శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయనున్నారు. బుధవారం శ్రీ విఖనస మహర్షి జయంతి జరిగింది. ఆ మరుసటి రోజు స్వామి, అమ్మవార్లు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అక్కడ ఆస్థానం నిర్వహించి నివేదన చేపడతారు. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం నిత్యకైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ వైఖానస ఆగమశాస్త్రాన్ని శ్రీ విఖనస మహర్షి రచించారు.
ఈ ఉత్సవం కారణంగా ఆగస్టు 31న గురువారం జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.