SIXTH PHASE OF KALYANAMASTU ON MAY 20-TTD EO SRI IYR KRISHNA RAO _ రాష్ట్ర వ్యాప్తంగా మే 20న ఆరవ విడత కల్యాణమస్తు – తి.తి.దే. ఇ.ఓ
TIRUPATI, FEB 24: The sixth phase of Kalyanamastu-the mass marriages programme by TTD is all set to take place across the state on May 20, said TTD EO Sri IYR Krishna Rao.
Addressing the media persons in a press conference held at TTD administrative building in Tirupati on Thursday, the EO said, the kalyanmastu programme is intended to help poor people in the Hindu community, who cannot bear the expenses of marriage. “So far TTD has successfully carried out five phases of mass marriages and 34,017 couples tied the knots in the last five phases apart from another 59 couples who got married in the maiden Kalyanamastu programme carried out at Chennai”, he said.
The EO said, “A four-member team of experts comprising TTD court astrologer Sri Tangirala Prabhakara Purnaiah Siddhanthi, Agama Advisors Sri Sundaravadana Bhattacharyulu and Dr.Vedantam Vishnu Bhattacharyulu, SV Veda Pathshala Principal Sri Srirama Murthy fixed the muhurat on May 20 between 9:52am to 10.04am which falls on Friday in Moola Nakshatra of Karkataka Lagnam in the auspicious month of Vaisakha and on the auspicious day of Bahula Tadiya”.
Sri Rao said, the TTD will organise the mass in all the constituency head quarters across the state with the co-operation from the state government. The date of registration for the couples will be announced shortly after holding discussions and teleconference with all the district collectors. This year also we involve the revenue department of the state government for more effective execution of the kalyanams. “Since we have more than two months time, by taking up extensive publicity activity we can ensure more public get benefited out of this noble and noval programme. The Hindu Dharma Prachara Parishad(HDPP) under the supervision of its new secretary Sri Kasi Reddy Venkat Reddy will carryout this mass marriages programme”, he added.
The media conference was also attended by Tirupati Joint EO Dr.N.Yuvraj, HDPP Secretary Sri K.Venkat Reddy, DyEO HDPP Sri Umapathy Reddy and Deputy EO Recruitment Cell Smt Chenchu lakshmi.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
రాష్ట్ర వ్యాప్తంగా మే 20న ఆరవ విడత కల్యాణమస్తు – తి.తి.దే. ఇ.ఓ
తిరుపతి, ఫిబ్రవరి – 24, 2011: తిరుమల తిరుపతి దేవస్థానము 2007వ సంవత్సరము నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ”కల్యాణమస్తు” – సామూహిక వివాహాల ఆరవ విడత కార్యక్రమాన్ని ఈ యేడాది మే 20వ తారీఖున నిర్వహించనున్నట్లు తితిదే ఇ.ఓ శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు తెలిపారు.
గురువారం నాడు తితిదే పరిపాలనా భవనంలో విలేఖరుల సమావేశంలో ఇ.ఓ. మాట్లాడుతూ తితిదే హిందూ సమాజంలోని అధిక శాతం పేదమద్య తరగతి వారిని దృష్టిలో ఉంచుకొని ధార్మిక సేవా ధృక్పథంతో కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉచిత వివాహాలు గత ఐదేళ్ళుగా నిర్వహిస్తోంది అని అన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఐదువిడతల కల్యాణమస్తు కార్యక్రమాల్లో 34,017 జంటలు శ్రీవెంకటేశ్వరస్వామి సాక్షిగా పవిత్రమైన కల్యాణబంధంలో ఒకటైనాయి అని అన్నారు. వీరే కాకుండా తమిళనాడులో చెన్నైలో నిర్వహించిన కల్యాణమస్తు కార్యక్రమంలో 59 జంటలు వివాహం చేసుకున్నారు అని అన్నారు. ఈ యేడాది కూడా అదేవిధంగా రాష్ట్రప్రభుత్వ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం తితిదే కల్యాణమస్తు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే నిర్వహిస్తుందని స్పష్టం చేసారు.
కాగా ప్రస్తుత కల్యాణమస్తు కల్యాణఘడియ ముహుర్తాన్ని తితిదే పండిత బృందం నిర్ణయించింది అని అన్నారు. తితిదే పంచాంగ కర్త శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి, ఆగమ సలహా ధారులు శ్రీ సుందర వదన భట్టాచార్యులు, డా|| వేదాంతం విష్ణు భట్టాచార్యులు, ధర్మగిరి వేదపాఠశాల ప్రిన్సిపల్ శ్రీ శ్రీరామ మూర్తి, ఈ నల్గురు చర్చించి మే 20వ తేదిన వైశాఖ బహుళ తదియ నాడు కర్కాటక లగ్నం నందు మూలానక్షత్ర యుక్త శుభతిథి ఉదయం గం 9.52 ని నుండి ఉదయం గం 10.04ని మధ్య ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది అని తెలిపారు. ఈ కల్యాణమస్తు కార్యక్రమాన్ని హిందూధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. అయితే అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యు అధికారులతో చర్చించిన అనంతరం వివాహ ధరఖాస్తు పత్రాల రిజిస్ట్రేషన్ తేదీలను త్వరలో ప్రకటించడం జరుగుతుందన్నారు.
దాదాపు రెండు నెలలకు పైగా వ్యవధి ఉండడంతో ఈ ఉత్తమ కార్యక్రమానికి మంచి ప్రచారాన్ని కల్పించి తద్వారా అనేక మంది పేదలకు కార్యక్రమ ఫలాలను అందజేయాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అందుకు మీడియా వారు కూడా సహకరించి తగిన ప్రచారాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి, తిరుపతి డా|| యన్.యువరాజ్, హిందూధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా.కసిరెడ్డి వెంకటరెడ్డి, రిక్రూట్ మెంట్ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి చెంచు లక్ష్మి పాల్గొన్నారు..
ఇప్పటి వరకు నిర్వహించిన కల్యాణమస్తు కార్యక్రమాల వివరాలుః-
మొదటి విడతః- 22.2.2007న 4658 మందికి వివాహాలు
ముహుర్తంః- అశ్విని నక్షత్రం, అభిజిత్ లగ్నం ఉ||11.54 గం||ల నుండి 12.05 గం||ల వరకు రెండవ విడతః- 26.8.2007న 8113 మందికి వివాహాలు
ముహుర్తంః- శ్రవణ నక్షత్ర యుక్త తులా లగ్నం ఉదయం 11.10 గం||ల నుండి 11.20 గం||ల వరకు
మూడవ విడతః- 9.3.2008న 6373 మందికి వివాహాలు
ముహుర్తంః- ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడిన మేషలగ్నం ఉ||9.20 నుండి 9.35 వరకు.
నాలుగవ విడతః- 2-11-2008న 7090 మందికి వివాహాలు
ముహుర్తంః- మూలా నక్షత్ర యుక్త ధనుర్లగ్నం ఉ||10.55 నుండి 11.10 వరకు.
ఐదవ విడతః- 28-10-2009న 7724 మందికి వివాహాలు
ముహుర్తంః- ధనిష్ఠ నక్షత్ర యుక్త వృశ్చికలగ్నం ఉ||9.20 నుండి 9.32 వరకు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.