SKANDA SHASTI PUJA HELD AT SVV UNIVERSITY _ ఎస్వీ వేద విశ్వ విద్యాల‌యంలో శాస్త్రోక్తంగా స్కంధ షష్ఠి పూజ‌ 

Tirupati, 20 Dec. 20: As part of holy Madgashira festivities Skanda Shasti Puja was held on Sunday at the Sri Venkateswara Vedic University.

Explaining the significance of the fete Acharya SS Sharma, Vice-chancellor of the university said it was the birthday of Sri Subramaniam Swamy, commander of Forces of Devatas who vanquished the demon Tarakasura.

He said worship of Shasti begets children for childless and healthy, disease-free infants.

Thereafter the Sri Subramaniam Swamy Shasti puja was performed.

SVBC CEO Sri Suresh Kumar, faculty of SVV university and students were present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

ఎస్వీ వేద విశ్వ విద్యాల‌యంలో శాస్త్రోక్తంగా స్కంధ షష్ఠి పూజ‌ 

తిరుప‌తి‌, 2020 డిసెంబ‌రు 20: మార్గ‌శిర మాసం సందర్బంగా తిరుప‌తి ఎస్వీ వేద విశ్వ విద్యాల‌యంలో ఆదివారం స్కంధ షష్ఠి పూజను శాస్తోక్తంగా నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ మాట్లాడుతూ శ్రీ సుబ్ర‌మ‌ణ్య స్వామివారు ష‌ష్ఠి రోజున ప‌ర‌మ శివుని అంశ‌తో జ‌న్మించార‌న్నారు. శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి దేవ‌త‌ల సైన్యానికి నాయ‌కుడని తెలిపారు. దేవతలను హింసించే తారకాసురుడిని  ఓడించి దేవ‌త‌ల‌ను విడిపించార‌న్నారు. 

ష‌ష్ఠి అన‌గా చిన్న పిల్ల‌ల‌కు ఆరోగ్యాన్ని ప్ర‌సాధించే అది దేవ‌త‌న్నారు. ష‌ష్ఠి దేవ‌తను పూజించ‌డం వ‌ల‌న సంతానం లేని వారికి సంతానం క‌ల‌గ‌డం, శిశువులు ఆరోగ్యంగా, అంగ‌వైక‌ల్యం లేకుండా జ‌న్మిస్తార‌ని వివ‌రించారు. 

అనంత‌రం శ్రీ సుబ్ర‌మ‌ణ్య స్వామివారి ష‌ష్ఠి పూజ నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌, వేద విశ్వ ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు. 
                 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.