REVIEW ON SKVST BTU ARRANGEMENTS_ శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి

Srinivasa Mangapuram, 27 January 2018: The arrangements for the annual brahmotsavams of Lord Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram has been reviewed at the temple premises on Saturday.

SE I Sri M Ramesh Reddy said, as the big fest commences with Dhwajarohanam on February 6 and concludes with Chakrasnanam on February 14, the nine day fete should be celebrated akin to Tirumala brahmotsavams without any compromise on arrangements.

He also said, mobile toilets, first aid centres, parking places, ambulances should be kept ready for the occaion. The prasadam counters need to be enhanced keeping in view the pilgrim rush”, he observed.

The security should be beefed up and srivari sevakulu should be deployed in sufficient numbers, he said.

PRO Dr T Ravi, Temple DyEO Sri Venkataiah and other officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి

తిరుపతి, 2018 జనవరి 27: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్యతో కలిసి ఎస్‌ఇ శనివారం సాయంత్రం ఆలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై 14వ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలను తిరుమల బ్రహ్మోత్సవాల తరహాలో నిర్వహించాలన్నారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. వేద పాఠశాల నుండి అర్చకులు, వేద పండితులు ద్వారా వేదపారాయణం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనసేవల వివరాలతో పుస్తకాలు ముద్రించి, భక్తులకు అందిచాలని, పుస్తక విక్రయశాల తొమ్మిది రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ప్రజాసంబంధాల అధికారికి సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు.

ఫిబ్రవరి 10వ తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలని ఎస్‌ఇ సూచించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్‌.వి. సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి ప్రసాదం కౌంటర్లను పెంచాలన్నారు. మొబైల్‌ మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. టిటిడి విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

సమావేశం అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఇంజినీరింగ్‌ అధికారులు పరిశీలించారు.

ఈ సమావేశంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, విజివో శ్రీఅశోక్‌కుమార్‌ గౌడ్‌, ఇఇ శ్రీ మనోహరం, ఏఈవో శ్రీ శ్రీనివాసులు, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.