SKVST BRAHMOTSAVAM POSTERS RELEASED_ శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirupati, 27 January 2018: TIrumala JEO Sri KS Sreenivasa Raju released the posters of annual brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy of Srinivasa Mangapuram at his bungalow in Tirupati on Saturday.

The annual event will commence on February 6 and concludes on February 14 with Garuda Seva on February 10, Rathotsavam on February 13 and Chakrasnanam on final day.

Temple DyEO Sri Venkataiah, Temple Inspector Sri Anil were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుపతి, 2018 జనవరి 27: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శనివారం తిరుపతిలోని తమ బంగళాలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఫిబ్రవరి 6 నుంచి 14వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయని, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

06-02-2018(మంగళవారం) ధ్వజారోహణం(కుంబలగ్నం) పెద్దశేష వాహనం

07-02-2018(బుధవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

08-02-2018(గురువారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
09-02-2018(శుక్రవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

10-02-2018(శనివారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

11-02-2018(ఆదివారం) హనుమంత వాహనం స్వర్ణరథం,గజ వాహనం

12-02-2018(సోమవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

13-02-2018(మంగళవారం) రథోత్సవం అశ్వవాహనం

14-02-2018(బుధవారం) చక్రస్నానం ధ్వజావరోహణం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.